Kantara Chapter 1:కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘కాంతారా చాప్టర్ 1’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరొకసారి ఈ సినిమా షూటింగ్ సెట్లో అపశృతి చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ సెట్లో జరిగిన ప్రమాదం కారణంగా జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ (Kapil )తన ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన కొల్లూరులో జరిగింది. ఈ విషయం విని అటు సినీ సెలబ్రిటీలు, ప్రేక్షకులు, ప్రజలు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకెళితే ‘కాంతారా’ సినిమా యూనిట్ గత కొన్ని రోజుల క్రితం కొల్లూరులోని జూనియర్ ఆర్టిస్టులతో వెళుతున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత గాలివానకు భారీ ఖర్చుతో నిర్మించిన సెట్ కూడా ధ్వంసం అయింది. ఇప్పుడు ఇదే సినిమా షూటింగ్లో ఒక జూనియర్ ఆర్టిస్టు విషాదకరంగా మరణించాడు.
ఈతకు వెళ్లి కాంతారా జూనియర్ ఆర్టిస్ట్ మృతి..
ఈ సినిమా కోసం పనిచేస్తున్న కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. ఉడిపి జిల్లా బైందూర్ లోని కొల్లూరు లో ఈ ఘటన జరిగింది షూటింగ్ పూర్తయిన తర్వాత కపిల్ తన బృందంతో కలిసి కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్ళాడు. నీటి లోతు తెలియకుండానే వారు నదిలోకి దిగారు. దీంతో అతడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కపిల్ మరణంతో చిత్ర బృందం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
కాంతారా ఛాప్టర్ 1 సినిమా విశేషాలు..
కాంతారా ఛాప్టర్ 1 చిత్రానికి ప్రముఖ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఈయనే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండడం గమనార్హం. హోంభలే ఫిలిమ్స్ ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో విడుదలై సంచలన విజయం సాధించిన కాంతారా సినిమాకి ప్రీక్వెల్ గా ఈ సినిమా రాబోతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే అంతా బాగానే ఉన్నా.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇలా సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి తలెత్తుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ కాంతారా ఛాప్టర్ 1 సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ రెండవ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మొత్తానికి అయితే భారీ అంచనాల మధ్య ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. కానీ ఇలా సినిమా షూటింగ్ జరిగేటప్పుడే ఒకదాని తర్వాత ఒకటి విషాదం పలు అనుమానాలకు దారితీస్తోంది. మరి కొంతమంది దైవంతో ఆటలు సరికాదు ఆచితూచి అడుగులు వేయాలని రిషబ్ శెట్టికి సలహాలు ఇస్తున్నారు.
ALSO READ:Dancer Tony Kick: ఎట్టకేలకు స్పందించిన జాను లిరి మాజీ భర్త.. చచ్చిబ్రతికా.. అది పెద్ద శాడిస్ట్..!