Shahrukh Khan:ఏ ఇండస్ట్రీలో అయినా సరే సినీ సెలబ్రిటీలు కాస్త లగ్జరీగా జీవిస్తారని చెప్పడానికి, వారు ఉపయోగించే వస్తువులే నిదర్శనం అని చెప్పవచ్చు. ముఖ్యంగా చేతికి పెట్టుకునే గడియారం మొదలు కాళ్లకు వేసుకునే షూ వరకు ప్రతిదీ కూడా ప్రత్యేకమే.. అత్యంత ఖరీదైన వస్తువులను ధరిస్తూ వారి ఫ్యాషన్ సెన్స్ ను అభిమానులకు పరిచయం చేస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి వీరు ధరించే ఈ వస్తువుల ధరలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అంతేకాదు వీటి ప్రత్యేకతలు చూస్తే మాత్రం నిజంగా అవునా అని ఆశ్చర్యపోకమానరు. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) ధరించిన వాచ్ అందరినీ ఆకర్షించడమే కాకుండా దాని ధర అలాగే వాటి ప్రత్యేకతలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. షారుఖ్ ఖాన్ ఇటీవల ఒక బాలీవుడ్ ఈవెంట్ లో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన వాచ్ అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసింది. మరి షారుఖ్ పెట్టుకున్న ఆ వాచ్ ఖరీదు ఎంత? దాని ప్రత్యేకతలు ఏంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
షారుఖ్ ఖాన్ ధరించిన వాచ్ వివరాలు..
ఇక షారుఖ్ ఖాన్ ధరించిన వాచ్ వివరాల విషయానికి వస్తే.. ఆయన అడెమర్స్ పిగట్ బ్రాండ్ వాచ్ ధరించారు. 18 క్యారెట్ శ్యాండ్ గోల్డ్ తో తయారు చేయబడింది. ఈ మోడల్ వాచ్లు ప్రపంచం మొత్తం మీద కేవలం 250 మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఒక్కొక్క వాచ్ ధర అక్షరాల రూ.76 లక్షల పై మాటే. దీంతో ఈ వాచ్ ఖరీదు తెలిసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ బాద్షా అంటే ఆ రేంజ్ ఉండాల్సిందే అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఈ వాచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు టాలీవుడ్ లో ఎక్కువగా ఎన్టీఆర్ (NTR ) వాచ్లు చాలా ఖరీదైనవి అని అందరూ కామెంట్లు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు షారుఖ్ ఖాన్ వాచ్ ధర కూడా అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
షారుక్ ఖాన్ సినిమాలు..
షారుఖ్ ఖాన్ విషయానికి వస్తే.. బాలీవుడ్ బాద్ షాగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. వరుస ప్లాపుల తర్వాత 2023లో గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చి, బ్యాక్ టు బ్యాక్ 3 విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం ఈయన చేతిలో ఒక చిత్రం మాత్రమే ఉంది. గతంలో లాగా వరుస సినిమాలు చేయకుండా కేవలం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక ఈయన కూతురు సుహానా ఖాన్ (Suhana Khan) లీడ్ రోల్ లో చేస్తున్న సినిమాలో షారుఖ్ ఖాన్ తాజాగా కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఇక అలాగే షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) కూడా ఇండస్ట్రీలోకి హీరో గా కాకుండా దర్శకుడిగా మారి ఇండస్ట్రీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా షారుఖ్ ఖాన్ లగ్జరీ లైఫ్ అందరినీ ఆశ్చర్యపరుస్తోందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఆయన ధరిస్తున్న వస్తువులు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఇక ఇప్పుడు ఈయన వారసులు కూడా అదే రేంజ్ లో ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.