Allu Arjun : టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా మాస్టర్ వేధింపులకు గురిచేసారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ అమ్మాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు. దాదాపు నెలరోజుల పాటు మాస్టర్ జైల్లోనే గడిపాడు.. ఆ తర్వాత బెయిల్ రావడంతో అయినా విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన జానీ మాస్టర్, ఆయన భార్య పలు ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ నిజాలను బయటకు తీసుకొస్తామని, నేను ఏ తప్పు చేయలేదని జానీ మాస్టర్ అంటున్నారు. ఆ ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియోలు కూడా ఆ మధ్య వైరల్గా మారాయి. తాజాగా మాస్టర్ పై కేసు పెట్టిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో మాస్టర్ గురించి ఆమె పలు కీలక విషయాలను బయటపెట్టింది. అంతే కాదు అల్లు అర్జున్ పేరు కూడా ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది.. అసలు శ్రేష్ట అల్లు అర్జున్ గురించి ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం..
జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు..
తెలుగు చిత్ర పరిశ్రమలో డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు జానీ మాస్టర్.. దాదాపు ఇండస్ట్రీలోని అందరు హీరోల చేత స్టెప్పులు వేయించారు మాస్టర్. తెలుగులో మాత్రమే కాదు అటు తమిళ్లో కూడా ఈయన పలు హీరోలకు స్టెప్పులు నేర్పించారు.. మాస్టర్ కు జాతీయ అవార్డు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన తనను లైంగికంగా వేధించారని తన అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్ట వర్మ ఆయనపై పోలీస్ కేసు పెట్టింది. ఆ కంప్లైంటు తో మాస్టర్ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అనంతరం ఆయన నేరం ఒప్పుకోవడంతో సెంట్రల్లో ఉంచారు. దాదాపు నెలరోజుల పాటు మాస్టర్ జైల్లోనే గడిపారు. ఆ తర్వాత బెయిల్ రావడంతో విడుదలయ్యారు. బయటకొచ్చిన జానీ మాస్టర్ తన తప్పు లేదంటూ న్యాయం బయటకు వస్తుంది అని సోషల్ మీడియా తో పాటుగా పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు. అంతేకాదు వరుస సినిమా అవకాశాలను అందుకుంటు బిజీ అయ్యారు జానీ మాస్టర్.. అయితే తాజాగా జానీ మాస్టర్ పై కేసు పెట్టిన శ్రేష్ఠ వర్మ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ వచ్చి పలు సంచలన విషయాలను షేర్ చేసుకుంది. ఆమె ఏం చెప్పిందంటే..
అల్లు అర్జున్ నా సపోర్ట్ చెయ్యలేదు..?
జానీ మాస్టర్ నన్ను లైంగికంగా వేధించారు నాకు 16 ఏళ్ల వయసు నుంచే ఆయన లైంగిక దాడి చేశారు. ఆ సమయంలో నేను చాలా చిన్న పిల్లని భయపడ్డాను అందుకే చెప్పలేకపోయాను. నాలుగేళ్లు ఆయన మారతారని వెయిట్ చేశాను ఇక ఆయన మారారని తెలుసుకొని ఆయనపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను తప్ప వేరే ఉద్దేశం లేదు అని శ్రేష్ట వర్మ ఇంటర్వ్యూలో చెప్పింది. తను న్యాయం కోసం పోరాడుతున్నానని కచ్చితంగా న్యాయం వచ్చేంతవరకు నేను పోరాడతానని, బెదిరింపులకి అసలు భయపడనని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతే కాదు అల్లు అర్జున్ పేరు కూడా ఇంటర్వ్యూలో వినిపించడం గమనార్హం. దానిపై స్పందించిన శ్రేష్ట.. నా వెనుక అల్లు అర్జున్ ఉన్నారన్నది అవాస్తవమని నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదని ఆమె బయట పెట్టారు. తన కుటుంబమే తనకు మొదటి నుంచి అండగా ఉందని వారు సపోర్ట్ తోని నేను ఇంత దూరం వచ్చానని ఆమె అన్నారు. ఇక జానీ మాస్టర్ కు జాతీయ అవార్డు క్యాన్సల్ అవ్వడానికి తనకు ఎటువంటి సంబంధం లేదని ఆమె అన్నారు.. ప్రస్తుత మామ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ వీడియోను షేర్ చేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ సినిమాలు విషయానికొస్తే.. ఇటీవల పుష్ప 2 తో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.