BigTV English
Advertisement

Animal Movie : షారుక్ రికార్డులు బద్దలు కొట్టిన ‘యానిమల్’..

Animal Movie : షారుక్ రికార్డులు బద్దలు కొట్టిన ‘యానిమల్’..
Animal Movie

Animal Movie : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా రణబీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ గురించే చర్చలు జరుగుతున్నాయి.కొందరు ఈ మూవీ ని పొగుడుతుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మాండంగా ఉన్నాయి. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియన్ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం చాలా చోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.


తెలుగులో కూడా స్ట్రైట్ తెలుగు సినిమాలకు దీటుగా ఈ చిత్రం కలెక్షన్స్ రాబడుతుంది. మరో పక్కన నార్త్ లో విపరీతంగా వసూళ్లు కురిపిస్తుంది. ఇటు సౌత్ లో అటు నార్త్ లో ఏకధాటిగా ఈ చిత్రం తన హవా కొనసాగించడం తో వసూళ్లు కూడా అదే రేంజ్ లో నమోదవుతున్నాయి. మొదటిరోజు వరల్డ్ వైడ్ ఈ చిత్రం 116 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. దీంతో ఇది రణబీర్ కపూర్ కెరియర్ లోని బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ .. అది కూడా నాన్ హాలిడే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మూవీ రికార్డు సృష్టించింది. ఆ తర్వాత రెండు రోజులు వరుసగా వచ్చిన కలెక్షన్స్ తో ఇప్పటివరకు బాలీవుడ్ లో నమోదైన ఎన్నో రికార్డులు చెల్లాచెదురయ్యాయి.

ఈ సంవత్సరం సారు జవాన్, పఠాన్ అంటూ బాక్స్ ఆఫీస్ వద్ద కలకలం రేపాడు. అయితే బ్రేకులు లేని బండి లాగా వచ్చిన ‘యానిమల్’.. ఈ రికార్డులను ఢీ కొట్టింది. ఇప్పటివరకు బాలీవుడ్ లో జవాన్ ఖాతాలో కలెక్షన్స్ పరంగా ఉన్న అన్ని రికార్డులు నమోదు అయ్యాయి. తాజాగా ఈ చిత్రాన్ని యానిమల్ బీట్ చేసింది. రెండవ రోజు జవాన్ మూవీ హిందీలో 128.23 కోట్ల నెట్ వసూలు సాధించగా..’యానిమల్’ 131.07 కోట్ల నెట్ సెకండ్ డే కలెక్షన్స్ తో ముందంజలో ఉంది.


ప్రపంచవ్యాప్తంగా రెండవ రోజుకి ఈ చిత్రం సుమారు 236 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ మూవీలో యాక్షన్ ,ఎమోషన్ సన్నివేశాలలో రణబీర్ తన విశ్వరూపాన్ని చూపించాడు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ సినిమాలో ప్రతి సీను ఒక మాస్టర్ పీస్.. అందుకే ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్ లో కూడా ఈ సినిమాని విపరీతంగా ఆదరిస్తున్నారు కానీ.. ఈ సినిమా తమ ఫేవరెట్ హీరో చేసి ఉంటే ఇంకెంత బాగుండేదో అని అనుకోకుండా అయితే ఉండలేకపోతున్నారు. ‘యానిమల్’మరింకెన్ని రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×