E-Paper
Advertisement

Pooja Hegde Rejected Movies List: నిజంగా హీరోయిన్ పూజా హెగ్డేది అదృష్టమే.. రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ.. అట్టర్ ప్లాఫ్

Pooja Hegde Rejected Movies List: నిజంగా హీరోయిన్ పూజా హెగ్డేది అదృష్టమే.. రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ.. అట్టర్ ప్లాఫ్
Advertisement

Pooja Hegde Rejected Movies List: టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హూదా సంపాదించుకున్న వారిలో నటి పూజా హెగ్డే ఒకరు. 2014లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది ఈ టాల్ బ్యూటీ పూజా.

Advertisement

ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం సినిమా ఆఫర్లు కరువయ్యాయి. ఆమెకు సరైన హిట్టు పడి చాలా కాలమే అయింది. ఆమె నటిస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌గా నిలువడమే ఇందుకు ప్రధాన కారణం.

అయితే బుట్టబొమ్మ పూజా హెగ్డేకు ఇటీవలే ఐదు సినిమా ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో మూడు ప్రాజెక్టులకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది. అయితే ఆ సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌గా నిలిచాయి. మరి ఆ సినిమాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Also Read: పవన్ కల్యాణ్ హీరోయిన్ కృతి ఖర్బంద, పుల్కిత్ సామ్రాట్ పెళ్లికి ప్లేస్ ఫిక్స్.. ఎక్కడంటే

గుంటూరు కారం:

మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘గుంటూరు కారం’. ఇందులో మెయిన్ హీరోయిన్‌గా ముందుగా పూజా హెగ్డేను మేకర్స్ సెలెక్ట్ చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ మూవీ నుంచి పూజా హెగ్డే తప్పుకుంది. అనంతం ఆమె ప్లేస్ లోకి మరో హీరోయిన్ వచ్చింది. ఇక థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అంతేకాకుండా దర్శకుడిపై తీవ్ర విమర్శలు, ట్రోలింగ్స్ వచ్చాయి.

షెహజాదా:

కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ నటించిన మూవీ ‘షెహజాదా’. ఈ మూవీ తెలుగు హిట్ ‘అల వైకుంఠపురం’లో మూవీకి రీమేక్. తెలుగు వెర్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా నటించగా.. హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించి మంచి మార్కులు అందుకుంది. అయితే ఈ మూవీ హిందీ వెర్షన్‌కి రోహిత్ ధావన్ దర్శకత్వం వహించాడు. హిందీలో కూడా హీరోయిన్‌గా తొలుత పూజా హెగ్డేను మేకర్స్ సంప్రదించారట. అయితే ఆమె దానికి నో చెప్పింది. ఇక తెలుగులో హిట్ అయిన ఈ సినిమా హిందీలో మాత్రం ఫ్లాప్‌గా నిలిచింది.

ఈగల్ (2024):

Also Read: ఆస్కార్స్‌ సాధించిన సినిమాలు.. ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?

రవితేజ – కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. ఇందులో కావ్యా థాపర్, అనుపమ పరమేశ్వరన్, నవదీప్‌లు కీలక పాత్రలో నటించారు. అయితే ఈ మూవీ భారీ తారాగణం ఉన్నా.. బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోలేకపోయింది. దీనికోసం కూడా మేకర్స్ పూజాను సంప్రదించగా ఆమె తిరస్కరించినట్లు ఆ మధ్య టాక్ వినిపించింది.

బ్లడీ డాడి:

షాహిద్ కపూర్, సంజయ్ కపూర్, డయానా పెంటీ నటించిన సినిమా ‘బ్లడీ డాడి’. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీ కోసం మేకర్స్ ముందుగా నటి పూజా హెగ్డేను సంప్రదించగా.. ఆమె నో చెప్పింది. ఈ మూవీలో తన పాత్రకు తగినంత ఇంపార్టెన్స్ లేకపోవడంతో బుట్టబొమ్మ తిరస్కరించిందట. అయితే ఈ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఆపరేషన్ వాలెంటైన్:

మెగా హీరో వరుణ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కింది. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ మూవీలో మానుషి చిల్లరి హీరోయిన్‌గా నటించింది.

Also Read: అందర్నీ ఫూల్స్ చేసిన జాన్‌సీనా.. ఆస్కార్ వేదికపైకి నగ్నంగా రాలేదు.. ఇదిగో ఫుల్ ఫోటో..

ఇందులో మానుషి చిల్లర్ కంటే ముందు పూజాను మేకర్స్ మీట్ అయ్యారట. అయితే స్టోరీ మంచి ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. ఇందులో హీరోయిన్ పాత్ర ఆమెకు ఆసక్తిని కలిగించలేదట. అందువల్ల ఈ సినిమాకు కూడా పూజా నో చెప్పింది. మొత్తానికి తన వద్దకు వచ్చిన ఐదు సినిమాలను వదులుకోవడం మంచే జరిగిందని పూజా హెగ్డే అభిమానులు అంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×