Big Stories

Mission Bhagiratha AE: ఫ్యామిలీ అంతా ప్రభుత్వ ఉద్యోగులే.. ఈజీ మనీకోసం రూ.15 కోట్లు అప్పు చేసి మరీ!

online betting

- Advertisement -

Mission Bhagiratha AE Rahul Betting Debts: అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి. నెలకు లక్ష పైనే జీతం.. అయినా అతనికి డబ్బు వ్యామోహం తీరనే లేదు. ఈజీగా డబ్బులు ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు. దీంతో ఆన్ లైన్ గేమ్స్, రమ్మీలాంటి పలు ఆన్ లైన్ గేమ్స్ కి బెట్టింగులు పెట్టడం మొదలు పెట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కోట్లు అప్పు చేసి మరి బెట్టింగులు మొదలుపెట్టాడు. చివరకి ఉద్యోగం పోగొట్టుకోవడంతోపాటు జైలు పాలయ్యాడు.

- Advertisement -

వివరాల్లోకి వెళ్తే.. కీసర మండలం మిషన్ భగీరథ ఏఈగా పని చేసే రాహుల్ ఆన్ లైన్ గేమ్స్ కు బానిసయ్యాడు. ఏకంగా రూ.15 కోట్లు అప్పు చేసి డబ్బులు చెల్లించలేదు. తిరిగి అడిగితే.. వాటి చెల్లింపులకు తగిన పనులు ఇప్పిస్తానని నమ్మించి కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. ఇతని వ్యవహారం ఉన్నత అధికారులకు తెలిసి ఆరు నెలల క్రితం అతను ఉద్యోగం చేస్తున్న కంపెనీ నుంచి సస్పెండ్ చేశారు. అతనికి సహకరించిన అదే శాఖలో పని చేస్తున్న ఓ అధికారిని కూడా సస్పెండ్ చేశారు.

Also Read: SIB మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావ్‌ అరెస్ట్.. కేసును సీఐడీ లేదా సిట్ కు బదిలీ చేస్తారా ?

రాహుల్ కాంట్రాక్టర్లను నమ్మించి దాదాపు 37 మందిని మోసం చేసి సుమారు రూ.15 కోట్లు వరకు డబ్బులు తీసుకున్నాడు. ఆపై పనులు చూపించలేదు సరికదా.. ఇంకా వారికి తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వలేదు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కీసర పోలీస్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాహుల్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా పరారీలో ఉన్న రాహుల్ సోమవారం విదేశాలకు పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కాడు. అతన్ని సోమవారం రాత్రి పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి విచారిస్తున్నారు. రాహుల్ భార్య, తల్లి దండ్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కావడం విశేషం. ఇలా ఉన్నత ఉద్యోగం చేస్తూ సాఫీగా ఉన్న తన జీవితాన్ని బెట్టింగ్ మాయలో పడి నాశనం చేసుకున్నాడు రాహుల్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News