BigTV English

Lady Aghori Marriage : అఘోరి పెళ్లి చట్టబద్ధం కాదు… శేఖర్ భాష స్ట్రోక్ మామూలుగా లేదు… అది అలా అనాలి

Lady Aghori Marriage : అఘోరి పెళ్లి చట్టబద్ధం కాదు… శేఖర్ భాష స్ట్రోక్ మామూలుగా లేదు… అది అలా అనాలి

Lady Aghori Marriage: యాంకర్ గా, రేడియో జాకీగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన వ్యక్తి శేఖర్ భాష. బిగ్బాస్ సీజన్ 8 లో శేఖర్ భాష కొన్ని రోజులు ఉండి వచ్చాడు. ఆయనను తీసేయడం వెనుక చాలా పెద్ద విషయం నడిచిందని అప్పట్లో యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూలో ఇచ్చి మరీ తెలిపాడు శేఖర్ భాష. ఆ తర్వాత లావణ్య, రాజ్ తరుణ్ గొడవలలో ఎంట్రీ ఇచ్చాడు. శేఖర్ భాష పై లావణ్య కంప్లైంట్ ఇచ్చేదాకా వెళ్ళింది. ఇప్పుడు తాజాగా లేడీ అఘోరీ, ఆమెతో పాటు ఉన్న అమ్మాయిపై తనదైన శైలిలో విమర్శించారు. అసలు శేఖర్ భాష వారి గురించి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం..


లేడీ అఘోరీగా అల్లూరి శ్రీనివాస్..

తెలంగాణలో కొన్ని రోజుల క్రితం ఒక మహిళ తనకు తాను లేడీ అఘోరి అంటూ ప్రకటించుకొని సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకున్నారు. అల్లూరి శ్రీనివాస్ గా కొంతమంది పిలుస్తున్నారు. కొంతమంది అమ్మాయి అని, మరికొంతమంది కాదు అబ్బాయి అని అంటున్నారు. కొన్ని రోజుల క్రితం కొండగట్టు వేములవాడ రాజన్న, కీసర, ముత్యాలమ్మ తల్లి, మొదలైన పెద్దపెద్ద ఆలయాలలో లేడీ అఘోరి సందర్శించి, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయింది. ఈమె బట్టలు లేకుండా శరీరం పై బూడిద రాసుకొని ఆలయాల్లో పూజలు చేస్తూ, నాగ సాధువుగా ఆమెకి ఆమె ప్రకటించుకుంది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీటెక్ చదివిన శ్రీ వర్షిణీ అనే యువతి అఘోరతో వెళ్లిపోవడంతో ఆ వార్త పెద్ద సంచలనమే రేపింది. ఆమె తల్లిదండ్రులు అఘోరి మాయమాటలు చెప్పి, శ్రీ వర్షిని తీసుకువెళ్లిందని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. వారు ఇరువురు పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించి పెళ్లి చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో వదిలారు. ఆ తరువాత ఇద్దరూ వీడియో ద్వారా మమ్మల్ని ఎవరు వెతకవద్దని, మీరు వెతికితే మేము దొరక్కుండా వెళ్ళిపోతాము అంటూ తెలిపారు.


శేఖర్ భాష స్ట్రోక్ మామూలుగా లేదు..

ఈ విషయం ఇలా జరుగుతూ ఉండగా.. దీని గురించి శేఖర్ భాష ఇంటర్వ్యూలో వీరిద్దరి గురించి మాట్లాడారు. ఇద్దరు అమ్మాయిలు అన్యాయం అయిపోయారు. దీని గురించి మీరేం మాట్లాడతారు అని శేఖర్ భాషాని అడగ్గా.. వారిద్దరూ చేసుకున్న స్వయంకృతాపరాధం. వాళ్లకు వాళ్లు తీసుకున్న డెసిషన్ అది. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదని.. మనం చదువుకున్న చదువు మనకు ఏం నేర్పిస్తుంది. ఇద్దరు చదువుకున్న ఆడవాళ్లే, బీటెక్ చేసిన ఒక అమ్మాయి, లా చదివే మరో అమ్మాయి, అఘోరితో వెళ్లిపోవడం, వారిద్దరూ వాళ్లకి వాళ్లే తీసుకున్న నిర్ణయం. లా చదివే అమ్మాయి, ఏ రకంగా సమర్ధిస్తుంది. జాలి పడాల్సిన అవసరం లేదా అంటే.. అస్సలు జాడి పడాల్సిన అవసరమే లేదు. చదువుకున్న మహిళ అయ్యుండి ఆయన్ని పెళ్లి చేసుకున్నానని ఎలా అంటుంది. ఆయన అసలు మగాడే కానప్పుడు వివాహం చట్టబద్ధం కాదు అని తెలిసినప్పుడు.. నీకు అన్ని తెలిసి నేను ఏడు అడుగులు వేశాను అంటే అది చట్ట ప్రకారం, అది పెళ్లి కాదు. నువ్వు అన్ని తెలిసి లా చదువుకొని ఇలా మాట్లాడుతున్నావ్ అంటే, నీ సంస్కారం ఎటు పోయింది. నీ చదువు ఏమైందని, వాళ్ళ మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు అని శేఖర్ బాషా తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన వారంతా శేఖర్ భాష ను సమర్థిస్తున్నారు. వారు చేసిన దానికి ఇలానే మాట్లాడాలి అని కామెంట్స్ పెడుతున్నారు .

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×