Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. డిగ్రీ, ఇంటర్, ఎంబీబీఎస్, పీజీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WCD-TIRUPATI) తిరుపతి లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారందరూ ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవప్రదమైన జీతం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ(WCD-TIRUPATI) తిరుపతి కాంట్రాక్ట్ విధానంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 30న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 12
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ(WCD-TIRUPATI) లో పలు రకాలు పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో కౌన్సిలర్ (ఫిమేల్), సోషల్ వర్కర్ (మేల్), డేటా అనలిస్ట్, ఔట్ రీచ్ వర్కర్, డేటా అనలిస్ట్, ఔట్ రీచ్ వర్కర్, పార్ట్ టైమ్ డాక్టర్, ఎర్లీ చైల్డ్ హుడ్ సోషల్ వర్కర్ (ఫీమేల్), ఆయా (ఫీమేల్), చౌకీదార్ (ఫీమేల్), తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
కౌన్సిలర్(ఫిమేల్): 01
సోషల్ వర్కర్(మేల్): 01
డేటా అనలిస్ట్: 01
ఔట్ రీచ్ వర్కర్: 01
పార్టైమ్ డాక్టర్: 01
ఎర్లీ చైల్డ్‌హుడ్ సోషల్ వర్కర్(ఫీమేల్): 01
ఆయా(ఫీమేల్): 04
చౌకీదార్(ఫీమేల్): 01
అసిస్టెంట్ కమ్ డీఈవో: 01
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 15
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 30
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంటర్, ఎంబీబీఎస్, పీజీ పాసై ఉండాలి. ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తు ప్రక్రియ విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి జీతం నిర్ణయించారు. నెలకు కౌన్సిలర్, సోషల్ వర్కర్, డేటా అనలిస్ట్ పోస్టులకు రూ.18,536, ఔట్ రీచ్ వర్కర్‌కు రూ.10,592, పార్ట్ టైమ్ డాక్టర్‌కు రూ.9,930, ఆయా, చౌకీదార్‌కు రూ.7,944, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.13,240 జీతం కల్పిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉంటుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200 ఫీజు ఉంటుంది.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: అప్లికేషన్ ను మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ, తిరుపతికి పంపాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://tirupati.ap.gov.in/
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 12
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 30
Also Read: Telanagna Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలు..