BigTV English

Badshah : పాకిస్థానీ నటితో బాలీవుడ్ ర్యాపర్ ఎఫైర్… వ్యవహారం మొత్తం బయటపెట్టిన శిల్పా శెట్టి..!

Badshah : పాకిస్థానీ నటితో బాలీవుడ్ ర్యాపర్ ఎఫైర్… వ్యవహారం మొత్తం బయటపెట్టిన శిల్పా శెట్టి..!

Badshah : తాజాగా “ఇండియన్ ఐడల్ 15” షో నుండి ఒక వీడియో వైరల్ అవ్వగా. అందులో బాలీవుడ్ ర్యాపర్ బాద్ షా (Badshah) .. పాకిస్తానీ నటి తారా సుతారియా (Tara Sutaria) తో డేటింగ్ చేస్తున్నారు అంటూ ప్రముఖ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి (Shilpa Shetty) హింట్ ఇచ్చింది. ఇక దీంతో ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా పాకిస్తానీ నటి తారా సుతారియా, బాలీవుడ్ ర్యాపర్ బాద్ షా తో ప్రేమలో ఉన్నారు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.. కానీ ఈ విషయాలపై వీరు పెద్దగా స్పందించలేదు. కానీ వీరిద్దరి రిలేషన్ పై ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి హింట్ ఇవ్వడంతో అందరూ ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నారు.


తారా సుతారియా ప్రేమలో బాద్ షా.. హింట్ ఇచ్చిన శిల్పా శెట్టి..

అసలు విషయంలోకి వెళ్తే.. ఇండియన్ ఐడల్ 15 నుంచి వచ్చిన వీడియో ఆన్ లైన్ లో చెక్కర్లు కొడుతుండడంతో దీనిపై శిల్పా శెట్టి మాట్లాడుతూ.. “బాద్ షా మిమ్మల్ని తారా చూస్తోంది. తారాని మీరు కూడా చూస్తున్నారని నాకు తెలుసు. ఇక మీ ఇద్దరినీ చూస్తుంటే నాకు 90 లలో ఒక పాట గుర్తు వస్తోంది అంటూ ఆ పాటను పాడి మరీ వినిపించింది శిల్పా శెట్టి. అంతేకాదు వీరిద్దరి రిలేషన్ ని కూడా ఆమె బయట పెట్టడంతో బాద్ షా ఆ కార్యక్రమంలో ఏం చేయాలో తెలియక తెల్ల ముఖం వేసుకొని కూర్చున్నాడు. పైగా తార సుతారియా, బాద్ షా హగ్ చేసుకున్న వీడియోని కూడా ఆ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. మొత్తానికి అయితే వీరిద్దరి రిలేషన్ గురించి శిల్ప చమత్కరించడంతో ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు శిల్పా శెట్టి మాటలు అర్థం చేసుకున్న శ్రేయ ఘోషల్ కూడా నిజమేనని స్పష్టం చేసింది. మొత్తానికైతే బాలీవుడ్ ర్యాపర్ బాష్ షా, పాకిస్తానీ నటి తారా సుతారియా తో ప్రేమలో పడినట్లు స్పష్టం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


తారా సుతారియా కెరియర్..

ఈమె 2019లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక అదే సంవత్సరం ‘మార్జావాన్’ సినిమాలో కూడా నటించిన ఈమె మరో 3 చిత్రాలలో నటించింది. ఇక తర్వాత ఇంకో సినిమాలో నటించలేదు. ఇక సినిమాలే కాదు టెలివిజన్ రంగంలో కూడా పనిచేసింది. ముఖ్యంగా 2011లో వచ్చిన ఎంటర్టైన్మెంట్ కే లియే కుచ్ బి ఖరేగా సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్గా పాల్గొని ఆకట్టుకుంది.

ALSO READ:Maha Bharatham: బాలీవుడ్‌లో మరో మహా భారతం.. ఇంకెన్ని తీస్తారయ్య సామి!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×