9 Years Of Sarainodu : ప్రతి హీరో కెరియర్ లో ఒక మాస్ సినిమా ఉంటుంది. ప్రతి హీరో కూడా తన కెరియర్ లో ఒక కమర్షియల్ సినిమా చేయడానికి ఇష్టపడుతుంటాడు. అలానే చాలామంది కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చారు ఇప్పుడున్న జనరేషన్లో కమర్షియల్ సినిమాను మాస్ కు నచ్చే విధంగా తీయడంలో బోయపాటి శ్రీను తోపు అని చెప్పాలి. అయితే బోయపాటి శ్రీను ఎన్ని సినిమాలు చేసినా కూడా బాలకృష్ణతో బోయపాటి శ్రీను సినిమా అంటే ప్రత్యేకంగా ఉంటుంది. బాలయ్య బాబుతో ఊర మాస్ పర్ఫామెన్స్ ఇప్పిస్తూ ఉంటాడు. ఇకపోతే మెగా హీరోలతో కూడా బోయపాటి శ్రీను పనిచేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను సరైనోడు అనే సినిమాను చేశాడు. అల్లు అర్జున్ కెరీర్ లో ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. మునుపెన్నడూ చూపించిన విధంగా అల్లు అర్జున్ ను ఈ సినిమాలో చూపించాడు బోయపాటి శ్రీను.
పక్కా కమర్షియల్
ఈ సినిమా మొదలైనప్పుడు నుంచి ఇది ఒక కమర్షియల్ ఫిల్మ్ అంటూ ప్రమోట్ చేస్తూ వచ్చారు. అప్పటికే అల్లు అర్జున్ మాస్ సినిమాలు చేసినా కూడా వాటన్నిటిని మించి ఈ సినిమా ఉంటుందే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తర్వాత ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకి మొదట సన్నాఫ్ సత్యమూర్తి లో నటించిన సమంతా ను తీసుకుందామని బోయపాటి శ్రీను ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాలవల్ల సమంత చేయకపోవడంతో, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్ మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమాలు అల్లు అర్జున్ తో పాటు భారీ తారాగణం కూడా నటించింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ తీరు కంప్లీట్ గా మారిపోయిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తారు.
పవన్ ఫ్యాన్స్ తో మొదలైంది ఇక్కడే
ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత మాట్లాడటానికి ఒక వేదికపై నిలుచున్నారు అల్లు అర్జున్. ఆ తరుణంలో చాలామంది పవన్ కళ్యాణ్ పేరును మాట్లాడమని ప్రస్తావించారు. అప్పటికే చాలా ఫంక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పవర్ స్టార్, పవర్ స్టార్ అని అరవడం అలవాటుగా మారిపోయింది. ఇక సరైనోడు సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ డైరెక్ట్ గా స్టేజ్ పైన చెప్పను బ్రదర్ అని పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ అనేశారు. ఇక్కడతో ఫ్యాన్ వార్స్ మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్ వార్స్ కాస్త, అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అనుకునే స్థాయికి వెళ్లిపోయాయి. ఇక్కడినుంచి అల్లు అర్జున్ కూడా తన అభిమానులను ఆర్మీ అని పిలవడం మొదలు పెట్టారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. నేటికీ ఈ మార్పు జరిగి 9 ఏళ్ళు అవుతుంది.
Also Read : Sukumar : సుక్కు గ్యారేజ్‌లోకి బడా ఓటీటీ.. ఒక సైన్యాన్ని వదులుతున్నాడుగా