Maha Bharatham: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గ్రంథం మహాభారతం (Maha Bharatham). ఇటు టాలీవుడ్ మొదలుకొని అటు బాలీవుడ్ వరకు ఈ మహాభారత ఇతిహాస కథను పలు ఫ్రాంచైజీలుగా తెరకెక్కించడానికి నటీనటులు మొదలుకొని దిగ్గజ దర్శకులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఎవరికి తోచినట్టు వారు ఈ మహాభారతం సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఎవరు ఎలా చేసినా కథ మాత్రం ఒకటే కాబట్టి ఆ సినిమాను తెరకెక్కించే విధానంలోనే దర్శకుడు టాలెంట్ బయటపడుతుంది. ఇప్పటికే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సొంతం చేసుకున్న అల్లు అరవింద్ (Allu Aravindh) ఇదివరకే ‘మహాభారతం’ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. అటు హాట్ స్టార్ ద్వారా ఫ్రాంచైజీలుగా ఈ సినిమా రాబోతోందని స్పష్టం చేశారు. ఇక మరొకవైపు టాలీవుడ్ దిగ్గజ దర్శక ధీరుడిగా పేరు సొంతం చేసుకున్న రాజమౌళి (Rajamouli ) కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని, కచ్చితంగా ఆ సినిమా చేసి తీరుతాను అంటూ కూడా చెప్పిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ లో మహాభారతం ప్రకటించిన అమీర్ ఖాన్..
అయితే ఇప్పుడు బాలీవుడ్లో కూడా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) కూడా మహాభారతం సినిమాను ప్రకటించడంతో.. ఇంకెంత మంది ఈ సినిమాను ప్రకటిస్తారు సామీ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి అమీర్ ఖాన్ ప్రకటించిన ఈ మహాభారతం మూవీ విశేషాలు ఏంటో ఆయనే చెప్పుకొచ్చారు. అమీర్ ఖాన్ తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” మహాభారత ఇతిహాసానికి నేను ప్రాణం పోయాలనుకుంటున్నాను. ఈ మహాభారతం సినిమాను నేటి తరానికి అందించాలనేదే నా కోరిక. ఈ ఏడాది దీని పనులు కూడా ప్రారంభించాలి అనుకుంటున్నాను. దీని రైటింగ్ కి ఇంకా కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ఒకే సినిమాల్లో మొత్తం చూపించలేము కదా. అందుకే సిరీస్ లుగా దీనిని అందించాలని నిర్ణయించుకున్నాను. భారీ స్థాయిలోనే ఈ సినిమా ప్రాజెక్టు రాబోతోంది. ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు దీనిలో వర్క్ చేయనున్నారు. స్టోరీ రాసుకున్న తర్వాత పాత్రలకు ఎవరు సరిపోతారో చూసుకొని, ఆ తర్వాత నటీనటులను ఎంపిక చేస్తాము. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో నేను నటిస్తానా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేను” అని కూడా తెలిపారు అమీర్ ఖాన్ .
రూ.1000 కోట్ల బడ్జెట్ తో భారీ చిత్రం..
ఇకపోతే ఈ మహాభారతం ప్రాజెక్టు గురించి అమీర్ ఖాన్ గతంలో కూడా మాట్లాడిన విషయం తెలిసిందే. “మహాభారతం విషయంలో బాధ్యతతో పాటు భయం కూడా ఉంది. ఎలాంటి తప్పు లేకుండా భారీ స్థాయిలోనే ఈ సినిమాను రూపొందించాలి అనుకుంటున్నాను. భారతీయులుగా ఈ కథ మన రక్తంలోనే ఉంది. కాబట్టి నాపై ఎంతో బాధ్యత పెంచింది. ఈ ప్రాజెక్టుతో భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలని, రూ.1000 కోట్ల బడ్జెట్ తో రూపొందించాలని అనుకుంటున్నాను అంటూ అమీర్ ఖాన్ తెలిపారు. మొత్తానికి అయితే ఈ మహాభారతం సినిమాను ప్రతి భాషలో కూడా ప్రకటిస్తారేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి ఎవరు ఈ మహాభారతంను కళ్లకు కట్టినట్టు చూపిస్తారో చూడాలి.
Also Read:Sai Pallavi: నా సక్సెస్ మంత్ర అదే.. ఎట్టకేలకు ఓపెన్ అయిన సాయి పల్లవి..!