BigTV English

Death Threat To Judge: నువ్వెంత నీబతుకెంత నిన్ను చంపేస్తా.. కోర్టులో న్యాయమూర్తిని బెదిరించిన నిందితుడు

Death Threat To Judge: నువ్వెంత నీబతుకెంత నిన్ను చంపేస్తా.. కోర్టులో న్యాయమూర్తిని బెదిరించిన నిందితుడు

Death Threat To Judge| న్యాయ వ్యవస్థ అంటే మన దేశంలో ఉన్నతమైనది. అందుకే కోర్టులో న్యాయ మూర్తి ముందు ఎంతటి వారైనా క్రమశిక్షణతో మెలగాలి. అలాంటిది ఒక న్యాయమూర్తిని ఒక కేసులో నిందితుడు.. విచారణ జరుగుతుండగా.. చంపేస్తానంటూ అందరి ముందు బెదిరించాడు. నువ్వెంత నీ బతుకెంత అంటూ హేళన చేస్తూ అన్నాడు. దీంతో ఈ ఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. న్యాయ స్థానాల్లో న్యాయ మూర్తులకు భధ్రతపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే నిందితుడే కాదు.. అతడి వైపు వాదించిన లాయర్ కూడా న్యాయమూర్తిని బెదిరించాడు. ఈ ఘటన మరెక్కడోకాదు దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఓ కోర్టులో జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న శివాంగి మంగ్లాను నిండు కోర్టు రూమ్‌లో ఒక లాయర్ , ఒక కేసులో నిందితుడు చంపేస్తామంటూ బెదిరించారు. కోర్టు బయట ఆమె ప్రాణాలతో ఇంటికి వెళ్లలేదని.. క్షేమంగా ఇంటికి వెళ్లాలంటే తమ కేసులో నిందితుడిని నిర్దోషిగా తీర్పు చెప్పాలని బెదిరించారు. ఈ ఘటన ఢిల్లీలోని ద్వారకా కోర్టులో ఏప్రిల్ 2, 2025న జరిగింది. ఆ తరువాత కూడా ఆమెను తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని పదే పదే బెదరించారు. దీంతో ఆమె ఇప్పుడు వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

ఢిల్లీ ద్వారకా కోర్టులో ఆరు సంవత్సరాల క్రితం ఒక చెక్ బౌన్సు కేసులో ఒక బడా వ్యాపార వేత్త పై కేసు నమోదైంది. ఆ వ్యాపారవేత్త చెక్ బౌన్సు కేసు విచారణ చేసిన జడ్జి శివాంగి మంగ్లా ఏప్రిల్ 2న కేసులో నిందితుడు అతుల్ కుమార దోషి అని తీర్పు చెప్పింది. ఆ తరువాత అతనికి చట్టం ప్రకారం.. ఆరు నెలల నుంచి ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. దాంతో పాటు అతను ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ శిక్ష వివరాలను జడ్డి శివాంగి మంగ్లా చదవబోతుండగా.. అంతలోనే కోర్టు రూమ్ లో అందరి ముందు నిందితుడు ఆగ్రహంగా కేకలు వేశాడు. మహిళా జడ్జి అని కూడా చూడకుండా పరుష పదజాలంతో అసభ్యంగా మాట్లాడాడు. ఆమెను ఏకవచనంతో సంబోధించాడు.


Also Read: మహిళా పోలీస్ హత్య.. రాష్ట్రపతి పురస్కారం అందుకున్న పోలీస్ అధికారికి జీవితకాలం జైలు

“ఏయ్ నువ్వెంత నీ బతుకెంత? నేను చూస్తాను ఇక్కడి నుంచి బయటికి వెళ్లాక నువ్వు ఇంటికి ప్రాణాలతో ఎలా తిరిగి వెళతావో?” అని అన్నాడు. అంతేకాదు తన లాయర్ అతుల్ కుమార్‌ తో మాట్లాడుతూ.. “ఆమె తీర్పుని మార్చాలి అందుకు నువ్వేం చేయాలో చేయి..” అని చెప్పాడు. దీంతో లాయర్ కూడా జడ్జి శివాంగి మంగ్లాను మీరు తీర్పు మార్చండి లేకపోతే మీకు మంచిది కాదు. వెంటనే చేయండి అని బెదిరించాడు. దీంతో ఆమె ఆ రోజు తీర్పు రిజర్వ్ చేసి ఇంటికి వెళ్లిపోయింది. ఆ తరువాత ఏప్రిల్ 5న తీర్పు వెలువరిచింది. నిందుతుడికి 22 నెలలు జైలు శిక్ష, రూ.6.5 లక్షల ఫైన్ విధిస్తూ.. తీర్పు చెప్పింది.

ఇంటికి వెళ్లాక ఆమెకు ఫోన్ చేసి బెదిరించారు. ఆమె తీర్పు మార్చకుంటే తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని.. చెప్పినట్లు చేయకపోతే ఆమె కుటుంబానికి హాని కలిగిస్తామని భయపెట్టారు. ఈ బెదిరింపులతో ఆమె ఈ సమస్యను తన ఉన్నతాదికారుల దృష్టికి తీసుకెళ్లింది. అలాగే ఢిల్లీ హై కోర్టులో దీనిపై స్పందించాలని కోరింది. తనను బెదిరించిన లాయర్ అతుల్ కుమార్ కు షో కాజ్ నోటీసులు జారీ చేసింది. అతనిపై బార్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసింది. తాను ఒక మహిళ కావడంతో ఒక మహిళను పరుష పదజాలంతో దూషించినందుకు మహిళా జాతీయ కమిషన్ లో ఫిర్యాదు చేసింది.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×