Naa Anveshana : శివ బాలాజీ.. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA ) కోశాధికారిగా పనిచేస్తున్న శివబాలాజీ (Siva Balaji) ఇండస్ట్రీలో నటీనటులకు వచ్చే సమస్యలపై వెంటనే స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవారికి ఏదైనా సమస్య వస్తే ‘మా’ తరఫున వెంటనే స్పందించి, వారికి తగిన న్యాయాన్ని కూడా చేకూరుస్తూ.. నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు శివ బాలాజీ. ఇకపోతే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ అన్వేష్ (Naa Anvesh) పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అన్వేష్ చేసిన కామెంట్లకు ఇతడి పేరు చెప్పగానే శివబాలాజీ (Siva Balaji) కోపంతో ఊగిపోయారు. ఇక అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. సెలబ్రిటీలపై మండిపడ్డ అన్వేష్..
సినీ ఇండస్ట్రీలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఎంతలా కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ను మొదలుకొని బడా పాన్ ఇండియా స్టార్స్ వరకు చాలామంది ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేసి ఇబ్బందుల్లో పడ్డారు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారో.. వారందరిపై కూడా కేసు ఫైల్ అవ్వగా.. ఒక్కొక్కరు విచారణకు హాజరయ్యి, పోలీసుల సూచనల మేరకు ఇకపై ఇలాంటివి చేయము అని వీడియోలు కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయినా సరే ప్రపంచయాత్రికుడిగా పేరు సొంతం చేసుకున్న యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ సెలబ్రిటీలు అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సెలబ్రిటీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపయోగించని పదజాలంతో అభిమానులకి కూడా కోపాన్ని తెప్పించాడు.
దీనికి తోడు వేలకోట్ల స్కామ్ చేశారు అంటూ నిజాలు తెలియకుండా మాట్లాడాడు అంటూ సదరు అభిమాన నటీనటుల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
నా అన్వేష్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన శివబాలాజీ..
ప్రస్తుతం ఇతడి పై సెలబ్రిటీలు అంతా కూడా గుర్రుగా ఉన్నవేళ అటు శివ బాలాజీ చేసిన కామెంట్లు కూడా సెలబ్రిటీలకే సపోర్టుగా నిలిచాయి. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా శివ బాలాజీ తన భార్య మధుమిత (Madhumita) తో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగానే ఇంటర్వ్యూయర్ ప్రశ్నిస్తూ.. “మీరు యూట్యూబ్ నిర్వహిస్తున్నారు కదా.. అందులో మీకు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని ఆఫర్ రాలేదా అంటే.. దానికి మధుమిత మాట్లాడుతూ.. “మా వద్దకు కూడా చాలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం వచ్చాయి. కాకపోతే ఏది కూడా మేము పూర్తిగా విచారించే వరకు వాటి జోలికి వెళ్ళలేదు. అటు కాస్మెటిక్స్ అయినా ఇటు ఆరోగ్యానికి సంబంధించింది అయినా ఏదైనా సరే నా వరకు వస్తే కచ్చితంగా దానిని ఉపయోగించి , నాకు లాభం కలిగింది అని తెలిస్తేనే దానిని ప్రమోట్ చేస్తాను” అంటూ తెలిపింది. ఇక తర్వాత ఇంటర్వ్యూయర్ ప్రశ్నిస్తూ.. అన్వేష్ సెలబ్రిటీలపై ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ లో భాగంగా చాలా కామెంట్లు చేశారు కదా.. దానికి మీరేమంటారు అని ప్రశ్నించగా.. శివబాలాజీ అన్వేష్ పేరు చెప్పగానే ఊగిపోయారు. శివ బాలాజీ మాట్లాడుతూ..” అతను తీసుకున్న టాపిక్ మంచిదే. కాదని చెప్పను. కానీ మాట్లాడే విధానం అంటూ ఒకటి ఉంటుంది. మనం ఏదైనా సరే ఒక అంశంపై మాట్లాడుతున్నాము అంటే దాదాపు ప్రజలకు అర్థమయ్యేలాగే చూడాలి. కాని ఇతరులను బ్లేమ్ చేసేలా ఉండకూడదు. అది చాలా తప్పు.. క్యారెక్టర్ పైనే దెబ్బ పడుతుంది..” అంటూ అన్వేష్ పై మండిపడ్డారు శివ బాలాజీ. ప్రస్తుతం శివబాలాజీ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Bellamkonda Sai Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ పై కేస్ ఫైల్.. తప్పు హీరోదే..!