Bellamkonda Sai Srinivas:ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఇక ఈ విషయం తెలిసి టాలీవుడ్ పరిశ్రమ ఒకసారిగా ఉలిక్కిపడింది. అసలు విషయంలోకి వెళ్తే.. ట్రాఫిక్ లో రాంగ్ రూట్ లో వెళ్లడమే కాకుండా కానిస్టేబుల్ తో హీరో దురుసుగా ప్రవర్తించినందుకు ఆయనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఇకపోతే ఇటీవల జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద శ్రీనివాస్ తన కారులో రాంగ్ రూట్ లో దూసుకొచ్చిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హీరోపై కేసు ఫైల్ అయింది. ఇది చూసిన నెటిజన్స్ కూడా తప్పు ఎవరి చేసినా తప్పే.. హీరో రాంగ్ రూట్లో రావడమే కాకుండా కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించడం స్పష్టంగా కనిపిస్తోంది కదా అందుకే కేస్ ఫైల్ చేశారు పోలీసులు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై బెల్లంకొండ శ్రీనివాస్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించిన హీరో..
అసలు విషయంలోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ లో తన ఇంటికి వెళ్తున్న క్రమంలో జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద హీరో రాంగ్ రూట్లో వచ్చాడు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకోవడంతో సదరు కానిస్టేబుల్ తో బెల్లంకొండ శ్రీనివాస్ దురుసుగా మాట్లాడాడు. అంతేకాదు కానిస్టేబుల్ పైకి కారుతో దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే ఈ విషయాలన్నింటిపై కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సదురు కానిస్టేబుల్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై కేసు ఫైల్ చేయించారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు..
ప్రముఖ బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు. 2014లో వచ్చిన ‘అల్లుడు శీను’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన, ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, రాక్షసుడు, సీత, అల్లుడు అదుర్స్ వంటి చిత్రాలలో నటించారు. ఇక ఛత్రపతి సినిమాతో హిందీలో కూడా అడుగుపెట్టిన ఈయన.. ఇప్పుడు కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని త్వరలో ‘భైరవం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మే 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మంచు మనోజ్ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohit) కూడా నటిస్తున్నారు. ఈ సినిమాల తర్వాత సైతాన్ నాయుడు, హైంధవ , కిష్కింధపూరి చిత్రాలను లైన్ లో పెట్టారు బెల్లంకొండ శ్రీనివాస్. అయితే ఇప్పుడు తాజాగా ఇలాంటి వార్తల్లో చిక్కుకున్నారు.
ALSO READ:HBD Anasuya: నాగ మూవీ మొదలు ఇప్పటివరకు అనసూయ ఎన్ని కోట్లు సంపాదించిందంటే..?