Rats Eat Infants| చంటి పిల్లలను తల్లిదండ్రులు అపురూపంగా ఎంతో జాగ్రత్త చూసుకుంటూ ఉంటారు. ఆ పసి వయసులో వారి ఆరోగ్యం కాపాడుకోవడం నిజానికి చాలా పెద్ద సవాల్. అయితే ఒక యువ జంట మాత్రం తమకు పుట్టిన పిల్లలను నిర్లక్ష్యం చేశారు. పొలంలో తిరిగే పెద్ద పెద్ద ఎలుకలను ఆహారంగా తమ పిల్లలను పెట్టారు. ఈ ఘటన అమెరికాలోని సౌత్ కెరోలీనా రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఇద్దరె కవల పిల్లలను పోలీసులు దీన స్థితిలో చూసి ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళితే.. అమెరికా సౌత్ కెరోలినా రాష్ట్రంలోని ఆండర్సన్ కౌంటీ కి చెందిన అకేలలా బియర్ డెన్ (24), ఆమె భర్త జస్టిన్ బియర్ డెన్ (24).. శుక్రవారం మే 9, 2025న తమ కౌంటీ పోలీసులకు ఫోన్ చేసి తమ ఇంట్లో ఎలుకలు దూరి వచ్చేశాయని తమకు ప్రాణాపాయం ఉందని ఫోన్ చేశారు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా.. ఇల్లంతా కంపు కొడుతోంది. పోలీసులు వారిని వివరణ కోరగా.. అప్పుడు అకేలా తమ ఇంట్లో ఈ సమస్య చాలా నెలలుగా ఉందని చెప్పింది. దీంతో పోలీసులు ఆ ఇంటిని మొత్తం పరిశీలించారు. అక్కడ వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది.
ఇంటి బేస్ మెంట్ లో పోలీసులు ఒక ఆరు నెలల పసిపాప కనిపించింది. ఆ పాపను వారు బేస్ మెంట్ లో పడేసినట్లు పోలీసులకు అర్థమైంది. ఆ పసిపాపను ఎలుకలు కొరుక్కుతిన్నాయి. పాప ముఖం, చేతులు, తల, చెవుల భాగాల నుంచి ఎలుకలు మాంసాన్ని తినిశాయి. ఇది చూసిన పోలీసులు వెంటనే పాపను సమీపంలోని గ్రీన్ వివల్లే మెమోరియల్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ తరువాత వారి ఇంట్లో మరో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు కూడా తెలిసింది. పెద్ద పిల్లాడు మూడేళ్లు ఉండగా.. మరో పసిపిల్లాడికి కూడా ఆరు నెలల వయసు. ఈ పసి పిల్లాడి చేతులపై కూడా ఎలుకలు కొరికినట్లు గుర్తులు ఉండడంతో పోలీసులు వెంటనే సోషల్ సర్వీసెస్ విభాగానికి సమాచారం అందించారు.
Also Read: సరదా కోసం సింహాన్నిపెంచుకున్న వ్యక్తి.. ఇంట్లో అంతా రక్తపాతం
సోషల్ సర్వీసెస్ విభాగం అధికారులు మిగతా ఇద్దరు పిల్లల్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకొని తల్లిదండ్రులిద్దరినీ అరెస్ట్ చేయించారు. అయితే కోర్టు వారికి బాండ్ పై బెయిల్ మంజూరు చేస్తూ తదుపరి విచారణని జూలై 31కు వాయిదా వేసింది. ఇలాంటి కేసు అక్టోబర్ 2024లో వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో వెలుగుచూసిన ఆ కేసులో ఒక తండ్రి తన పసిబిడ్డను ఎలుకల చేత కరిపించారు. దీంతో ఆ పసిబిడ్డ ముఖమంతా వికృతంగా మారింది. తీవ్ర రక్త స్రావమై బిడ్డ చనిపోయే స్థితిలో ఉండగా పోలీసులు ఆ బిడ్డను రక్షించారు. ఆ తరువాత కోర్టు ఆ తండ్రికి 20 ఏళ్ల కారాగార శిక్ష విధించింది.