BigTV English

Shobitha Dulipala : అప్పుడు గుండెలు పగిలేలా ఏడ్చాను… అక్కినేని కోడలు బయటపెట్టిన నిజం..

Shobitha Dulipala : అప్పుడు గుండెలు పగిలేలా ఏడ్చాను… అక్కినేని కోడలు బయటపెట్టిన నిజం..

Shobitha Dulipala : బాలీవుడ్ ముద్దుగుమ్మ శోభిత దూలిపాళ్ళ గురించి మొన్నటివరకు ఎవరికి పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ఆమె పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు.. ఆగస్టు 8 న అక్కినేని వారసుడు నాగ చైతన్య తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈ వార్త వైరల్ అవ్వడంతో అప్పటి నుంచి ప్రతి రోజు వార్తల్లో హైలెట్ అవుతుంది. ఈమె బ్యాగ్రౌండ్ గురించి తెలుగు ప్రజలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. గూగుల్ లో శోభిత గురించి వెతికేస్తున్నారు. అయితే ఈ అమ్మడు చేసిన సినిమాల గురించి తెలుసుకొని షాక్ అవుతున్నారు. ఇక తాజాగా తన లైఫ్ లో జరిగిన చేదు న్యూస్ గురించి అభిమానులతో ఆమె పంచుకుంది. ప్రస్తుతం ఈ వార్త చక్కర్లు కొడుతుంది..


ఈ ముద్దుగుమ్మ మోడల్గా కెరీర్ ప్రారంభించి తర్వాత నెమ్మదిగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఇమేజ్ దక్కించుకుంది. ఇక శోభిత పుట్టింది, పెరిగింది అంతా వైజాగ్ లోనే. అయినా తన కెరీర్ ముంబైలోనే ప్రారంభమైంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని శోభిత తన కెరీర్ ప్రారంభంలో ఏదురైన చేదు అనుభవాల గురించి కష్టాల గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఎటువంటి లక్ష్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. కానీ మోడల్గా ఆడిషన్స్‌కి వెళ్లే క్రమంలో ఎన్నో సంఘటనలు.. అవమానాలు ఎదుర్కొన్న.. ఎంతో బాధపడ్డా.. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న సమయంలో మోడలింగ్ చేయాలని ప్రయత్నించా.. కానీ అప్పుడు తెల్లగా లేనని ఎన్నో అవమానాలు దిగమింగానని చెప్పుకొని బాధ పడింది.

గతంలో ఓ షాంపూ యాడికి వెళ్తే నువ్వు కనీసం బ్యాగ్రౌండ్ మోడల్‌గా కూడా పనికిరావు అంటూ ఇన్‌సల్ట్‌ చేశారని.. తర్వాత ఇంటికి వెళ్లి అద్దం లో చూసుకుని చాలా రోజులు బాధపడుతూనే ఉన్నాను అంటూ శోభిత కేరీర్ స్టార్టింగ్ రోజుకు గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యింది. వాయిస్ బాగుంటుందని అందరూ అనేవాళ్ళు.. అలా నాలో కాన్ఫిడెన్స్ కాస్త పెరిగింది. చివరకు 100 ఆడిషన్లకు హాజరయ్యాక 2016 లో అనురాగ్ కస్యప్‌.. రామన్ రాఘవన్ 2లో అవకాశం వచ్చింది.. సినిమాలు ఒక్కొక్కటి హిట్ అవ్వడంతో నన్ను రిజెక్ట్ చేసిన షాంపు కంపెనీ కాల్ చేసి బ్రాండ్ ఎంబాసిడర్ గా ఉండమని కోరింది. ఇక ప్రస్తుతం అమ్మడు చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవుతున్నాయి. స్టేటస్ అనేది ఉంటే అవమానించిన వారే రెడ్ కార్ఫెట్ చేసి పిలుస్తారని చెప్పింది. ఇక చైతన్యతో ఈ మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ అమ్మడు త్వరలోనే పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని టాక్.. పెళ్లి ఎప్పుడో తెలియాల్సి ఉంది. పెళ్లికి టైం ఉండటం తో ఈమె కేరీర్ పై ఫోకస్ పెట్టిందని తెలుస్తుంది. ఇద్దరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ తో సినిమా చెయ్యనున్నాడు. త్వరలోనే ఆ మూవీ గురించి ప్రకటించనున్నారని సమాచారం..


Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×