BigTV English

Shraddha Kapoor: పెళ్లికి సిద్ధమైన శ్రద్ధ.. వాల్ పేపర్ లీక్..!

Shraddha Kapoor: పెళ్లికి సిద్ధమైన శ్రద్ధ.. వాల్ పేపర్ లీక్..!

Shraddha Kapoor:ప్రభాస్ (Prabhas)!హీరోగా వచ్చిన సాహో (Sahoo) సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) చాలాకాలంగా డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రియుడుతో కలిసి షికారుకు వెళ్తోంది. కానీ అతడితో లవ్ గురించిన రహస్యాన్ని మాత్రం లీక్ చేయడం లేదు. ఇది ప్రేమా ? లేక స్నేహం మాత్రమేనా? లేదా ఇంకా ఏదైనా ఉందా? అనే విషయంపై మాత్రం వీరు క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో బాలీవుడ్ మీడియా చాలా కన్ఫ్యూజన్లో పడిపోయిందని చెప్పవచ్చు.


శ్రద్ధ మొబైల్ వాల్ పేపర్ లో రాహుల్ మోడీ ఫోటో..

అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల శ్రద్ధా కపూర్ కి భారీ విజయాన్ని అందించిన చిత్రం స్త్రీ 2. ఈ సినిమా రచయిత రాహుల్ మోడీ (Rahul Modi) తో ఈమె చాలాకాలంగా స్నేహంగా కొనసాగుతోంది . అప్పుడప్పుడు రొమాంటిక్గా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు కూడా అభిమానులను సైతం ఆకట్టుకుంటోంది. ఇప్పుడు లీకైన వాల్ పేపర్ ఒకటి పెళ్లి పుకార్లకు తెరలేపిందని చెప్పవచ్చు. శ్రద్ధా కపూర్ ఫోన్ వాల్ పేపర్ లో రాహుల్ ఆమెను హగ్ చేసుకుని ఉన్న అందమైన ఫోటోగ్రఫీ ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారింది. తన చేతిలో పట్టుకున్న ఫోన్లో ఆమె ఏదో చూస్తూ నడుస్తూ వెళ్తుండగా ఒక మీడియా కెమెరా అదే పనిగా వెంటాడింది. దాంతో ఆ కెమెరాలో అసలు రహస్యం కాస్త రికార్డు అయింది. ఒకే ఒక క్లిక్ తో ఇప్పుడు ఆ రహస్యం ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది అని చెప్పవచ్చు. ఇక దీని బట్టి చూస్తే వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారన్నట్లు వార్తలు ఖరారు అవుతున్నాయి. ముఖ్యంగా వీరిద్దరి డేటింగ్ పై ఎటువంటి సందేహాలు అవసరం లేదని, తన ఫోన్ వాల్ పేపర్ చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ఇక ఈ వాల్ పేపర్ చూసిన అభిమానులు ఉత్సాహంగా ఈ విషయాన్ని షేర్ చేస్తూ త్వరగా పెళ్లి చేసుకోవాలని కూడా కోరుతున్నారు.


RT 76 Update: రవితేజ మూవీపై బిగ్ అప్డేట్.. టైటిల్ కూడా ఫిక్స్..!

వెకేషన్ లో సందడి చేసిన జంట..

ఇక దీనికి తోడు ఇటీవల శ్రద్ధా తన బర్తడే వేడుకలను పూర్తి చేసుకొని బోట్ నుండి దిగివస్తున్న సమయంలో కూడా రాహుల్ కనిపించారు. వీరిద్దరు డేటింగ్ లో ఉన్నట్టు స్పష్టం చెయ్యకపోయినా వీరి జంట ఫోటోలో మాత్రం దాదాపు అందరిలోనూ కన్ఫామ్ తెప్పిస్తున్నాయి. మరి దీనిపై శ్రద్ధా కపూర్ ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి. ఇకపోతే గతంలో స్త్రీ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాను సింగిల్ గా లేనని గతంలోనే హింట్ ఇచ్చింది. ఇప్పుడు ఇలా రాహుల్తో కనిపించడంతో అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. ఈమె స్పందించక పోయినా అటు రాహుల్ అయినా స్పందిస్తారేమో చూడాలి. మొత్తానికైతే ఈ జంటకు సంబంధించిన ఫోటోలు అలాగే శ్రద్ధా కపూర్ ఫోన్ వాల్ పేపర్ కాస్త ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. ఈమె సినీ నటి మాత్రమే కాదు గాయకురాలు కూడా.. ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తె.. 2010లో టీన్ పట్టి సినిమాలో చిన్న పాత్ర చేసిన ఈమె ఆ తర్వాత “లవ్ కా ది ఎండ్ ” అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక “ఆషీకీ 2″లో గాయని పాత్రలో ఈమె నటనకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×