ఈ రోజుల్లో చాలా మందికి బట్టతల కామన్ అయిపోయింది. టెన్షన్ జీవితం, పొల్యూషన్ కారణంగా జుట్టు త్వరగా ఊడిపోతుంది. మూడు పదుల వయసులోనే క్రికెట్ గ్రౌండ్ రెడీ అవుతోంది. జుట్టు ఊడిపోవడం పట్ల చాలా మంది టెన్షన్ ఫీలవుతారు. జుట్టలేకపోతే తోటివాళ్లు ఏం అనుకుంటారో అని సతమతం అవుతుంటారు. మరికొంత మంది లోలోన కుమిలిపోతుంటారు. అయితే, ఇకపై బట్టతల ఉందని టెన్షన్ పడాల్సి అవసరం లేదు. ఎందుకో తెలియాలంటే, ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే!
బట్టతలతో ఆదాయం!
బట్టతల అవమానం కాదు, ఆదాయాన్ని పొందే అద్భుతమైన మార్గం అని నిరూపిస్తున్నాడు కేరళలోని అలప్పుజకు చెందిన వ్లాగర్ షఫీక్ హషీమ్. తన బట్టతలపై యాడ్ వేసుకుని వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. అంబలపుళలోని కరూర్‌కు చెందిన 36 షఫీక్ తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రీసెంట్ గా తన ఫేస్ బుక్ వేదికగా ఓ ఆసక్తికర ప్రకట చేశాడు. తన బట్టతల ఫోటోలను షేర్ చేస్తూ.. ఆసక్తి ఉన్న బ్రాండ్ లు తన బట్టతలపై యాడ్స్ ఇచ్చుకోవచ్చని వెల్లడించాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. పదలు సంఖ్యలో కంపెనీలు ఆయన బాల్డ్ హెడ్ మీద యాడ్స్ ఇచ్చేందుకు ఆసక్తి చూపించాయి. బట్టతల మీద యాడ్స్ ప్రదర్శించిన తొలి వ్యక్తిగా షఫీక్ గుర్తింపు తెచ్చుకున్నాడు.
మూడు నెలల కాంట్రాక్ట్!
ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసిన వీడియోలో.. షఫీక్ కొచ్చిలో ఉన్న ఒక హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ క్లినిక్ కు సంబంధించి యాడ్ ను తన బట్టతలపై ప్రదర్శిస్తూ కనిపించాడు. ఆ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి కంపెనీ పేరు, వివరాలతో కూడిన టాటూ స్టిక్కర్‌ను ఉపయోగించాడు. ఒప్పందం ప్రకారం.. షఫీక్ మూడు నెలల పాటు ఆ ప్రకటనను ప్రదర్శించాల్సి ఉంటుంది.
ఇక తన యాడ్ గురించి షఫీక్ కీలక విషయాలు వెల్లడించాడు. “నా కాలేజీ రోజుల నుంచి బట్టతల గురించి ఆందోళన చెందేవాడిని. హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోవాలని ఎప్పుడూ కోరుకునేవాడిని. చాలా మంది నన్ను బాడీ షేమింగ్ చేసేవారు. ఫ్రెండ్స్ బట్టతల వాడా అంటూ ఆటపట్టించేవారు. కానీ, కొద్ది రోజుల తర్వాత బట్టతల అనేది తమ చేతులలో లేదని తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి ఎవరు ఏం అన్నా పట్టించుకునేవాడిని కాదు. ఆ తర్వాత బట్టతల గురించి ఆలోచించడం మానేసి, బట్టతల ద్వారా డబ్బులు సంపాదించాలని ఆలోచించేవాడిని. అందులో భాగంగానే, తన బట్టతలపై యాడ్స్ ఇవ్వాలని కోరాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. పలు కంపెనీలు నన్ను సంప్రదించాయి. తొలుత లా డెన్సిటే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ క్లినిక్ యాడ్ కు ఒప్పుకున్నాను. ఈ యాడ్ 3 నెలల పాటు ప్రదర్శించేందుకు వాళ్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. నెలకు రూ. 50, 000 ఇస్తామని చెప్పారు. సో, బట్టతల అనేది నాకు ఒక ఆదాయ వనరుగా మారినందుకు సంతోషంగా ఉంది” అని చెప్పుకొచ్చాడు. షఫీక్ హషీమ్ ఇప్పటికే ట్రావెలర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Read Also: కన్న తల్లిని చావగొట్టిన కూతురు.. నిప్పులు చెరుగుతున్ననెటిజన్లు!