BigTV English

NTR – Neel : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ‘డ్రాగన్ ‘ రిలీజ్ అయ్యేది అప్పుడే..?

NTR – Neel : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ‘డ్రాగన్ ‘ రిలీజ్ అయ్యేది అప్పుడే..?

NTR – Neel : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా మరోవైపు భారీగా కలెక్షన్స్ ని రాబట్టింది.. త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలోనే రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా చేయబోతున్నట్లు గతంలో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.. ఈ సినిమా కోసం అటు నందమూరి ఫ్యాన్స్ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సినిమా విడుదల తేదీ పై పలు రకాల వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఎన్టీఆర్ సినిమా త్వరలోనే రాబోతుందంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని సమాచారం..


ఎన్టీఆర్ సినిమాలు..

ఎన్టీఆర్ రాజమౌళితో చేసిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత అతని రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాకు ఆస్కార్ కూడా రావడంతో ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది.. దాంతో పాన్ఇండియా స్టార్ కాస్త గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఆ సినిమా తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడని ఫాన్స్ ఎదురుచూశారు. అందరూ ఊహించిన విధంగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీలో నటించాడు. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా కలెక్షన్స్ పరంగా బాగానే వసూలు చేసింది. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమాలో పోటీ పడుతున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే..


Also Read :ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ రెండింటిని అస్సలు మిస్ అవ్వకండి…

‘డ్రాగన్ ‘ రిలీజ్ అప్పుడే..?

మైత్రి మూవీస్ మేకర్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు. ఇక తాజాగా ప్రశాంత్ మూవీ రెగ్యులర్ షూటింగ్ను కూడా ప్రారంభించి షూటింగ్ లోకేషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. దీనిపై ఆడియన్స్ లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సీన్స్‌ షూట్ జరుగుతున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించారు. సినిమాకు అధికారికంగా టైటిల్స్ అనౌన్స్ చేయకున్నా.. ప్రస్తుతం డ్రాగన్ టైటిల్ లో పరిశీలిస్తున్నట్లు సమాచారం.. ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకేక్కిస్తున్నట్లు నిర్మాత ప్రకటించాడు. 2026 జనవరి 9న రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అంటే వచ్చే ఎడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.. కానీ ఇప్పుడు ఈ డేట్ మారినట్లు ఓ వార్త వినిపిస్తుంది.. వచ్చే ఏడాది మార్చి 26 న మూవీని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ సినిమా షూటింగ్ మొదలైన తర్వాతే డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×