Siddharth: కోలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం పక్కింటి అబ్బాయిలాగా మారిపోయాడు. తెలుగు తమిళ్ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక మధ్యలో కొంతకాలం సినిమాలుకు గ్యాప్ ఇచ్చిన సిద్దు..ఈమధ్యనే రీఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతున్నాడు.
ఇక ఈ ఏడాదే హీరోయిన్ అతిధిరాజు వివాహమాడి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాడు. సినిమాల విషయం పక్కనపెడితే సిద్ సినిమాలకంటే ఎక్కువ వివాదాల ద్వారానే ఫేమస్ అయ్యాడు. తనకు నచ్చని విషయం దేని గురించైనా నిర్మొహమాటంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు. ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఇలా ఎన్నోసార్లు.. రాజకీయాల గురించి, వివాదాల గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ విమర్శలపాలు అవుతూ ఉంటాడు.
BB Telugu 8: లాస్ట్ వీక్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. రూ.20 లక్షలతో బయటకెళ్ళేదెవరు..?
ఇక తాజాగా మరోసారి సిద్ధార్థ్ తన నోటికి పని చెప్పాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను కదిలించాడు. ప్రస్తుతం సిద్దార్థ్ నటిస్తున్న చిత్రం మిస్ యూ. ఈ సినిమా డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన సిద్దార్థ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్పట్టు సినిమాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాను షేర్ చేస్తుంది.
పుష్ప 2 ఈవెంట్ పాట్నాలో జరిగిన విషయం తెలిసిందే. పాట్నాలో జరిగిన పుష్ప 2 ఈవెంట్ కు జనాలు భారీగా తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలనంత మంది జనం అల్లు అర్జున్ కోసం వచ్చినట్లు అప్పట్లో వార్తలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఒక తెలుగు హీరో.. బీహార్ వచ్చాడు అని తెలిసి అంతమంది జనాలు రావడం ఒక రికార్డు అని చెప్పుకొచ్చారు.
Nandamuri Mokshagna : సినిమా క్యాన్సిల్… డబ్బులు తీసుకుని చేతులెత్తిసిన ప్రశాంత్ వర్మ ?
ఇక తాజాగా ఇదే ప్రశ్న సిద్దార్థ్ కు ఎదురైంది. పాట్నాలో జరిగిన పుష్ప 2 ఈవెంట్ కోసం భారీగా జనాలు వచ్చారు కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి..? అన్న ప్రశ్నకు సిద్దార్థ్ మాట్లాడుతూ “పుష్ప 2 ఈవెంట్ కు బీహార్ లో అంతమంది జనాలు రావడం నాకేమీ సర్ప్రైజ్ గా అనిపించడం లేదు. ఎందుకంటే ఈ కాలంలో జెసిబి వర్క్ చేసిన గుంతలను చూడడానికి కూడా జనాలు గుమిగూడుతున్నారు. అది కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే. వాళ్లు ఆర్గనైజ్ చేస్తేనే జనాలు వస్తారు.
మన ఇండియాలో జనాలు వస్తే అది గొప్ప కాదు. ఆ లెక్కన దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ప్రజలు వస్తారు. అలా అని అందరూ గెలవరు కదా. బిర్యానీ ప్యాకెట్, క్వాటర్ బాటిల్ కోసమే జనాలు వెళ్తున్నారు” అని సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సిద్దు పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అవడం మొదలుపెట్టారు.
Manchu Mohan Babu: మోహన్ బాబు మాట మార్చడం వెనుక మా ప్రెసిడెంట్ హస్తం.. ?
మా హీరోనే అలా అంటావా అంటూ విమర్శిస్తున్నారు. సిద్దార్థ్ వీధుల్లో ఐటం డాన్స్ చేసిన బీహార్ లోనే కాదు తమిళనాడులో కూడా ఎవరూ చూడడానికి రారు అంటూ విరుచుకుపడుతున్నారు. అల్లు అర్జున్ రేంజ్ ను చూసి హీరోల సైతం కుళ్ళు కుంటున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.