బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్(Bigg Boss)..చివరివారానికి చేరుకుంది. మరో ఐదు రోజుల్లో ఈ షో కాస్త పూర్తి కానున్న విషయం తెలిసిందే. 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో రసవత్తరంగా సాగింది. ప్రస్తుతం మొదటి నుంచి ఆడుతున్న ముగ్గురు అనగా నిఖిల్, నబీల్, ప్రేరణ టాప్ ఫైవ్లోకి రాగా.. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన గౌతమ్, అవినాష్ కూడా టాప్ ఫైవ్లోకి చేరుకున్నారు. ఇక వీరిలో టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ మొదటి ఫైనలిస్ట్ గా నిలిచారు. ఇక మరొకవైపు టైటిల్ రేసులో నిలిచిన గౌతమ్ , నిఖిల్ కూడా టాప్ ఫైవ్ కి వచ్చారు. వీరితో పాటు నబీల్, ప్రేరణ అందరి మనసులు గెలుచుకుంటూ టాప్ 5కి రావడం జరిగింది.
ఇకపోతే నిన్నటి వారంలో టాప్ ఫైవ్ లో నిలుస్తారనుకున్న రోహిణి, విష్ణు ప్రియ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. రోహిణి శనివారం ఎలిమినేట్ కాగా, విష్ణు ప్రియ ఆదివారం ఎలిమినేట్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇకపోతే ఆడియన్స్ కి ఆసక్తి కలిగించేందుకు బిగ్ బాస్ చివరి వారంలో ఎన్నో జిమ్మిక్కులు చేస్తారు. ప్రతి సీజన్లో కూడా ఇదే జరుగుతుంది. అయితే ప్రతి సీజన్లో ఫినాలే వీక్ లోకి ఆరుగురు కంటెస్టెంట్స్ అడుగుపెడితే.. అందులో మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఒకరిని బయటకు పంపించేవాళ్ళు. కానీ ఈ సీజన్లో మాత్రం టాప్ ఫైవ్ మాత్రమే ఫినాలే వీక్ లోకి తీసుకొచ్చారు బిగ్ బాస్.
అయితే ఈ టాప్ ఫైవ్ లో కూడా ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి ఫినాలే ఎపిసోడ్ కి కేవలం నలుగురిని మాత్రమే పంపే ఉద్దేశంలో బిగ్ బాస్ ఉన్నట్లు తాజా సమాచారం. అది కూడా ఓటింగ్ ద్వారా కాదు ప్రైజ్ మనీ ఆశ చూపించి బయటకి పంపించబోతున్నట్లు తెలుస్తోంది. గత సీజన్ లో కూడా ఈ ఆఫర్ వచ్చింది కానీ ఎవరు కూడా ఒప్పుకోలేదు. అయితే ఈ ఆఫర్ కి ఈ సీజన్లో కంటెస్టెంట్ ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టాప్ 2 లో నిఖిల్ , గౌతం ఉన్నారనే విషయం అందరికీ అర్థమైపోయింది. గత సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ లోనే టాప్ 2 లో ఎవరెవరు ఉన్నారో కూడా ప్రేక్షకులకు అర్థమైపోయింది.
అందుకే ఈ వీక్ ప్రైజ్ మనీతో బయటకు వెళ్లే కంటెస్టెంట్స్ ఉన్నారని చెప్పవచ్చు. ముందుగా రూ .10లక్షల నుంచి ప్రారంభించి, చివరికి రూ.20 లక్షల వరకు తీసుకెళ్లి డబ్బు తీసుకొని బయటకు వెళ్లాలనుకుంటే బిగ్ బాస్ కి చెప్పండి అని ఆఫర్ కూడా ఇవ్వనున్నారట. ఒకవేళ ఈ ఆఫర్ వస్తే అవినాష్ ఆ రూ .20లక్షలు తీసుకొని బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిగిలిన నలుగురిలో తాము టైటిల్ గెలవచ్చేమో అనే ఆశలు పెట్టుకున్నారు. కానీ అవినాష్ కి మాత్రం అలాంటి ఆశలు ఏమీ లేవు. ఎందుకంటే అతడికి కూడా ఒక క్లారిటీ ఉంది ఆడియన్స్ ఓటింగ్ లేదని కాబట్టి.. ఒట్టి చేతులతో బయటకు వెళ్లడం కంటే రూ.20 లక్షలు తీసుకొని బయటకు వెళ్లడం మేలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి చూద్దాం ఈ వారం ఎవరు రూ.20 లక్షల తీసుకొని వెళ్ళిపోతారో..