Gautam Gambhir: పింక్ బాల్ టెస్ట్ లో టీమిండియా ఓటమి పాలైన తరుణంలో..గంభీర్ పై ట్రోలింగ్ మొదలైంది. టీమిండియా ఓటమికి గౌతమ్ గంభీర్ తో పాటు ఆయన కోచ్ విధానమే కారణం అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. ఆడిలైడ్ వేదికగా జరిగిన రెండవ టెస్టులో ఆస్ట్రేలియా ( Australia) 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ ( Travis Head) అద్భుత సెంచరీతో కదం తొక్కగా….లబుషేన్ హాఫ్ సెంచరీతో తన సత్తాను చాటుకున్నాడు.
Also Read: IND vs Aus 3rd Test: ఆసీస్ తో జరిగే మరో 3 టెస్టుల టైమింగ్స్ మార్పు…ఇండియన్స్ చూడలేరు ?
అయితే టీమిండియా బ్యాటర్లు రాణించకపోవడంతో ఓటమి ఎదుర్కోక తప్పలేదు. దీంతో సిరీస్ పూర్తయింది. ఈ టెస్టు ఓడిపోవడంతో కోచ్ గంభీర్ పై విమర్శలు పుట్టిస్తున్నారు. హర్షిత్ రానా ఎంపిక కారణంగా గంభీర్ కార్నర్ అవుతున్నాడు. రానాను ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక చేయడం వెనుక అసలైన కారణం ఉందట. హర్షిత్ రానా ఐపీఎల్ లో కోల్కత్తా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. గత సీజన్లో గంభీర్ ఆ జట్టుకు మెంటార్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే రానాను జట్టులోకి గంభీర్ తీసుకువచ్చాడన్న కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. పెర్త్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా రానా అరంగేట్రం చేశాడు.
రానా మొదటి టెస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ట్రావిస్ హెడ్ వంటి బ్యాట్స్మెన్లను పెవిలియన్ కు చేర్చాడు. రానాతో తొలి మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీశాడు. అయితే రెండవ మ్యాచ్ లో అతనికి వికెట్లు దక్కలేదు. కేకేఆర్ పైన ఉన్న అభిమానంతోనే గంభీర్ రానాకు ప్రాముఖ్యత ఇస్తున్నాడనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పేరు కూడా తెరపైకి వచ్చింది.
Also Read: Mohammed Shami – Rohit Sharma: టీమిండియాలో అంతర్గత గొడవలు..రోహిత్ శర్మ వర్సెస్ షమీ ?
రానాను టెస్ట్ జట్టులో ఎంపిక చేయడం గంభీర్ నిర్ణయం ఒక్కడిదే కాదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కూడా గంభీర్ కు మద్దతు ఇచ్చినట్లు ఓ ఇంగ్లీష్ వార్త పత్రికలో వెల్లడయింది. టెస్ట్ మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో రానా ఎంపికపై రోహిత్ ను విలేకర్లు ప్రశ్నించగా… తొలి మ్యాచ్ లో రానా అద్భుతంగా బౌలింగ్ చేశాడని రోహిత్ చెప్పాడు. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి జట్టును ఆదుకున్నాడని అన్నాడు.
అయితే హర్షిత్ రానాను ఎంపిక చేసింది అతని దేశవాళి గణాంకాలను బట్టేనని గంభీర్ టీమ్ చెబుతోంది. ఎందుకంటే హర్షిద్ రానా ఐపీఎల్ లో కేకేఆర్ తరఫున కన్నా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతని గణాంకాలు బాగున్నాయి. దేశవాళీ మ్యాచ్ లలో అతడి ప్రదర్శన చూసి ఎంపిక చేయడానికి గంభీర్ మొగ్గు చూపాడని గంభీర్ టీమ్ సభ్యులు అంటున్నారు. కాగా డిసెంబర్ 14వ తేదీ నుంచి టీమిండియా, ఆసీస్ మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.