Manchu Mohan Babu: మంచు భక్తవత్సలం నాయుడు.. ఈ పేరు ఇప్పటి జనరేషన్ కు తెలిసి ఉండదు. ఒక పిటి మాస్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆయన.. నటనమీద ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చి.. మోహన్ బాబు అని పేరు మార్చుకున్నాడు. విలన్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని.. నెమ్మదిగా హీరోగా ఎదిగాడు. ఆ తరువాత మంచి మంచి కథలను ఎంచుకొని కలక్షన్ కింగ్ గా మారాడు మోహన్ బాబు మంచు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు మంచి సినిమాలను అందించాడు.
మోహన్ బాబు సినిమాల విషయం పక్కన పెడితే.. ఆయనకు ఇద్దరు భార్యలు.. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు మంచు లక్ష్మీ, మంచు విష్ణు.. రెండో భార్య కుమారుడు మంచు మనోజ్. ఈ అక్కాతమ్ముళ్లు ఎప్పుడు కలిసే ఉండేవారు. మంచు ఫ్యామిలీ బయటకు వచ్చింది అంటే.. అంత పెద్ద కుటుంబాన్ని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అన్ని అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు.. పెళ్లిళ్లు చేసుకున్నారు.
NC24: నాగచైతన్య – కార్తీక్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ.. ఎవరంటే..?
ఇక ఇప్పుడు ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఎప్పటి నుంచో అన్నదమ్ముల మధ్య వివాదాలు మొదలయ్యాయని వార్తలు వినిపిస్తున్నా.. ఏ రోజు మోహన్ బాబు ఇంటిగుట్టును బయటపెట్టలేదు. కానీ, నిన్నటికి నిన్న.. మోహన్ బాబు.. చిన్న కొడుకు మనోజ్ మీద పోలీస్ కేసు పెట్టాడు. తన కొడుకు, కోడలు తనను చంపడానికి చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.దీంతో ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది. అసలు మంచు కుటుంబంలో ఏం జరుగుతుంది అని అందరూ ఆ ఇంటివైపు చూస్తుంటే.. సడెన్ గా ఇప్పుడు మోహన్ బాబు వచ్చి ఇది అన్నదమ్ముల సమస్య.. మేము పరిష్కరించుకుంటాం అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
మోహన్ బాబు మాట మార్చడం వెనుక పెద్ద కొడుకు మంచు విష్ణు హస్తం ఉందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. నిన్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఒకటి.. ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి. నిన్నటివరకు మంచి విష్ణు ఇండియాలో లేడు. ఈరోజు వచ్చిన వెంటనే .. మా కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయి. త్వరలోనే అన్నింటికీ పరిష్కారం చూపిస్తాము. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చేసి చిత్రీకరించడం తగదు అని చెప్పుకొచ్చాడు. ఇక విష్ణు అలా మాట్లాడిన కొద్దిసేపటికే.. మోహన్ బాబు సైతం మాట మార్చేశాడు.
Pushpa 2 Tragedy:పుష్ప 2 ఖాతాలో మరో విషాదం… థియేటర్‌లో 37 ఏళ్ల వ్యక్తి మృతి
గతరాత్రి కొడుకు, కోడలిపై కేసు పెట్టిన మోహన్ బాబు.. మడిమ తిప్పి మాట్లాడాడు. ” ఇదంతా అన్నదమ్ముల మధ్య గొడవ. వారిద్దరూ తేల్చుకుంటారు. అందరి ఇళ్లలో ఉండే సమస్యలే. అన్ని పరిష్కారం అవుతాయి. గతంలో నేనే ఎన్నో కుటుంబాల మధ్య సమస్యలను పరిష్కరించాను. ఇప్పుడు మా కుటుంబంలో సమస్యలను మేమె పరిష్కరించుకుంటాం” అని చెప్పుకొచ్చాడు. మోహన్ బాబు ఇలా చెప్పడం పై ప్రేక్షకులు ఆశ్చర్యపోవడం లేదు.
ఎందుకంటే మంచు కుటుంబానికి మాట మార్చడం, మడిమ తిప్పడం అలవాటు అయిన పనినే. అంతకుముందు కూడా అన్నదమ్ములు కొట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. కానీ, రెండు రోజుల తరువాత చూస్తే అది రియాలిటీ షో అని మాట మార్చారు. ఇప్పుడు కూడా మోహన్ బాబు ను ఇన్వాల్వ్ చేయకుండా విష్ణు..చాలా పకడ్బందీగా ప్లాన్ చేయాలని చూస్తున్నాడు. అందుకే ఆ స్టేట్మెంట్ ను మార్చేలా చేశాడు అని అంటున్నారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.