BigTV English

Update on Game Changer Movie: ‘గేమ్ ఛేంజర్’ నుంచి మరో క్రేజీ అప్డేట్.. ఈ సారి ఏంటో తెలుసా..?

Update on Game Changer Movie: ‘గేమ్ ఛేంజర్’ నుంచి మరో క్రేజీ అప్డేట్.. ఈ సారి ఏంటో తెలుసా..?
Game Changer
Game Changer

Ram Charan’s Game Changer Movie Shooting Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకుని గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ఈ మూవీతో వరల్డ్ వైడ్‌గా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో చరణ్ చేయబోయే తదుపరి సినిమా కూడా అదే రేంజ్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే ప్రముఖ క్రియేటివ్ దర్శకుడు శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నాడు.


‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. అయితే ఇటీవలే ఈ మూవీ నుంచి ‘జరగండి.. జరగండి’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అంతగా రెస్పాన్స్ రాలేదు. ఆ సాంగ్ లొకేషన్స్ చాలా రియల్‌గా అద్భుతంగా ఉన్నా.. సాంగ్‌ మాత్రం అంతగా నచ్చలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. ఈ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాపీ కొట్టాడని కొందరు నెటిజన్లు విమర్శలు చేశారు.

అయితే దీనిపై నిర్మాత దిల్ రాజు ఓ ఈవెంట్లో స్పందిస్తూ.. ఈ సాంగ్ ప్రోమోని గతంలో రిలీజ్ చేయడంతో ఎవరికీ ఎక్కలేదని.. ఈ మూవీ రిలీజ్ అయిన రోజు ఈ సాంగ్ ప్రయోజనమేంటనేది అప్పుడు అర్థం అవుతుందని తెలిపాడు. అంతేకాకుండా ఇందులో ఉండే మొత్తం 5 సాంగ్‌లలో 3 సాంగ్‌లు దద్దరిల్లిపోతాయని చెప్పడంతో మూవీపై మరింత హైప్ పెరిగింది.


Also Read: థియేటర్ల వద్ద రివ్యూలు అడుగుతున్న నిర్మాత దిల్ రాజు.. వీడియో వైరల్

అయితే ఈ మూవీ నుంచి మరో అప్డేట్ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ తాజా షెడ్యూల్‌కి సంబంధించి ఓ అప్డేట్‌ బయటకొచ్చి వైరల్‌గా మారింది. ‘గేమ్ ఛేంజర్’ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ఏప్రిల్ మూడో వారం నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 20న రాజమండ్రిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఆపై వైజాగ్‌లో కూడా మరిన్ని సీన్స్ చిత్రీకరించనున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ షెడ్యూల్ 9 నుంచి 10 రోజులు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×