Ram Charan :మెగాస్టార్ వారసుడిగా చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. ఇంకా మెగాస్టార్ చిరంజీవి అంటే డాన్సులకు పెట్టింది పేరు. అదే స్థాయిలో తనలోని డాన్స్ టాలెంట్ కూడా బయటకు తీశాడు చరణ్. ఇక రెండవ సినిమా మగధీరతోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్నాడు. అక్కడితో చరణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని కొన్ని కాంట్రవర్సీలు కూడా చరణ్ ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత సినిమాలు చేస్తున్న కొద్దీ క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు చరణ్. ఇప్పుడు చరణ్ గ్లోబల్ లెవెల్ లో గుర్తింపు సాధించుకున్నాడు.
ఇకపోతే చరణ్ పర్సనల్ లైఫ్ లో కూడా చాలా హుందాగా ప్రవర్తిస్తారు. పవన్ కళ్యాణ్ పైన చరణ్ కి ఎంత అభిమానం ఉందో ప్రత్యకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో పవన్ కళ్యాణ్ కోసం వెళుతున్నప్పుడు కూడా అభిమానుల మీద పడిపోతున్న ఏమాత్రం అసహనం చూపించకుండా చరణ్ నడుచుకుంటూ వెళ్లిపోయిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. అయితే చరణ్ వ్యక్తిగతంగా ఎంత బాగున్నా కూడా కొంతమంది ట్రోల్ చేయడం మాత్రం ఇంకా మారలేదు. ఏదో ఒక విషయాన్ని పట్టుకొని ఏవో మాటలు అంటూనే ఉంటారు. ఇక తాజాగా అలాంటి సందర్భమే మరొకటి ఎదురయింది. ప్రతి ఏడాది రామ్ చరణ్ అయ్యప్ప మాలను వేస్తున్న సంగతి తెలిసిందే. అలానే ఈ ఏడాది కూడా వేశారు.
Also Read : Siddharth’s Miss You Flim : కనీసం ఈరోజు సినిమా రిలీజ్ అని కూడా గుర్తు లేదేమో
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా ఈవెంట్ నిన్న జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ (Ram Charan) హాజరయ్యారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ చాలా విషయాలు ప్రస్తావించారు. అయితే ముఖ్యంగా సాయి తేజ్ తో ఉన్న బాండింగ్ ను కూడా తెలిపారు. సాయి తేజ్ కి ఉన్న చనువుతో తనను వాడు వీడు అనడం మొదలుపెట్టాడు. ఇది వారిద్దరి మధ్య కామన్ గానే జరుగుతూ ఉంటుంది. అయితే ఒక సందర్భంలో వీడికి దాదాపు 38 ఏళ్ళు వచ్చేసాయి ఇంకా త్వరగా కానిచ్చేయ్ పెళ్లి చేసేసుకో అంటూ మాట్లాడాడు. త్వరగా కానిచ్చేయ్ అనే విషయాన్ని పట్టుకొని కొంతమంది రామ్ చరణ్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు స్వామి మాలలో ఉంటూ ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్.? కేవలం సమాజంలో మంచి వాడిని అని అనిపించుకోవడానికి స్వామి మాల వేస్తాడు అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Robin Hood : దిల్ రాజ్ పోటీగా, మైత్రి మూవీస్, నితిన్ ఒప్పుకుంటాడా.?