KC Venugopal News Today: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఈ విషయంలో ఏమాత్రం భ్రమ పడవద్దని నేతలకు సూచన చేశారు. తీరు మార్చుకోని మరికొందరి నేతలను సున్నితంగా హెచ్చ రించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో ఆయన సమీక్ష నిర్వహిం చారు. దీనికి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, సీనియర్ నేతలు, అలాగే నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు కూడా హాజరయ్యారు.
దిక్కుతోచని బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ వైపు చూస్తున్నారని, వాళ్ల రాకను ఏమాత్రం ఆపొద్దన్నారు కేసీ వేణుగోపాల్. తెలంగాణలో కొద్దిరోజులుగా బీజేపీ వీక్‌గా ఉందని, ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ ఇవ్వొద్ద న్నారు. ఈసారి అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే పార్టీకి కీలకమన్నారు. 15 సీట్లు కచ్చితంగా గెలవాలని చెప్పిన కేసీ వేణుగోపాల్.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేశారాయన.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందువల్ల, ఇప్పుడు గెలుస్తామనే భ్రమలో నేతలు ఉండ వద్దన్నారు కేసీ వేణుగోపాల్. బీఆర్ఎస్ పూర్తిగా బలహీన పడిందని, ఆ పార్టీపై ఎక్కువ దృష్టి పెట్టవద్ద న్నారు. పోరాటం అంతా బీజేపీతోనే అని చెప్పుకొచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్‌కు చెందిన కొందరు నేతలు పార్టీలోకి వస్తే క్షేత్రస్థాయిలో కొందరు నేతలు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
Also Read: Wine shops rush: రద్దీగా వైన్ షాపులు, 24 గంటలపాటు బంద్
బీఆర్ఎస్ బలహీన పడిన ప్రాంతాల్లో బీజేపీ పుంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని కేసీ వేణుగోపాల్ అన్నట్లు సమాచారం. జిల్లాల నుంచి వచ్చే నేతలను చేర్చుకోవడంపై మంత్రులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వీడినవారిని మళ్లీ తిరిగి చేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ప్రచారంలో కొందరు అభ్యర్థులు వెనుకబడ్డారని, ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సలహాలు ఇచ్చారు కేసీ వేణుగోపాల్. సోమవారం నుంచి అభ్యర్థులు, ముఖ్యనేతలు నియోజకవర్గాల్లోనే ఉండాల న్నారు. పార్టీ ప్రకటించిన గ్యారంటీను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అంతకుముందు నియోజకవర్గాల అభ్యర్థులు, ఇన్‌ఛార్జుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్ శంషాబాద్ లోని నోవాటేల్ హోటల్ లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ముఖ్యనేతలతో కేసీ వేణుగోపాల్ భేటీ.
లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సభలు సమావేశాలు, అగ్రనేతల పర్యటనల పై పీసీసీ ముఖ్య నేతలతో చర్చ.#kcvenugopal #aicc #Congress #Telangana… pic.twitter.com/U0q9S6spix
— BIG TV Breaking News (@bigtvtelugu) April 14, 2024