Watch Love Guru Movie and Get Free Summer Trip Tickets: తమ సినిమా ప్రేక్షకుల్లోకి మరింతగా చేరేందుకు మూవీ టీం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మూవీ రిలీజ్‌కు ముందు ప్రమోషన్లను డిఫరెంట్‌గా చూస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతూ ఉంటుంది. అలాగే సినిమా రిలీజ్ తర్వాత కూడా సరికొత్త మరింత మంది ఆడియన్స్‌కు చేరువయ్యేలా ప్రత్యేక ఆఫర్లతో ఆకట్టుకుంటున్నారు. ఇది వరకు చాలా మూవీ టీంలు తమ సినిమాను మరింత మంది చూసేలా ఎన్నో ఆఫర్లను ప్రకటించాయి.
గతంలో సుహాస్ నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ మూవీ టీం కూడా మహిళలకు ఫ్రీగా టికెట్లు ఇచ్చి తమ సినిమాపై మరింత ఆదరణను అందుకుంది. అలాగే మరికొన్ని చిత్రాలు తక్కవ ధరలకే తమ సినిమా టికెట్లను అందించి మరింత మందికి చేరువయ్యేలా చేసింది. ఇప్పుడు ఇదే బాటలోకి మరొక సినిమా వచ్చింది.
అదే ‘లవ్ గురు’. విజయ్ ఆంటోని, మృణాళిని రవి హీరో హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 11న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Also Read : పుష్ప 2 టీజర్ సెన్సేషనల్ రికార్డు.. ఆనందం వ్యక్తం చేసిన మూవీ టీం
ఈ నేపథ్యంలో ‘లవ్ గురు’ మూవీ యూనిట్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ మూవీ మరింత మందికి చేరువయ్యేలా మేకర్స్ ఓ ఎగ్జైటింగ్ ఆఫర్‌ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాను చూసిన ప్రేక్షకుల్లో కొందరినీ ఫ్రీగా సమ్మర్ ట్రిప్‌కు తీసుకెళ్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే ఫస్ట్ ప్రైజ్ విన్నర్‌కు మలేషియా, సెకండ్ ప్రైజ్ విన్నర్‌కు కాశ్మీర్, థర్డ్ ప్రైజ్ విన్నర్‌కు ఊటీ వంటి ప్రదేశాలకు ఫ్రీగా సమ్మర్ హాలీడే ట్రిప్‌కు తీసుకెళ్తామని మూవీ టీం తెలిపింది.
Watch #LoveGuru in theatres with your family and stand a chance to win an all paid trip with your family ✨
3 lucky winners to 3 exotic holiday destinations, follow the steps mentioned above 🤩
Hurry up, book now 💥
🎟️ https://t.co/ZdTixXBQZETelugu Release by @MythriOfficial… pic.twitter.com/fnzhbYyhPq
— Mythri Movie Makers (@MythriOfficial) April 14, 2024
అయితే ఈ ఆఫర్ ఇవాల్టి నుంచి (ఏప్రిల్ 14) నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. అంతేకాకుండా దీన్ని ఎలా పొందాలో కూడా వారు తెలిపారు. ‘లవ్ గురు’ మూవీ చూసిన ప్రేక్షకులు వారి పేరు, ఫోన్ నెంబర్, టికెట్ వివరాలను రాసి థియేటర్ దగ్గరే ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలి. అయితే ఆన్‌లైన్‌లో కొనుక్కున్న వారు 9963466334 నెంబర్‌కు టికెట్ ఫొటోను వాట్సాప్ చేయాలి అని తెలిపారు. అయితే ఇది పూర్తి ఉచిత సమ్మర్ ట్రిప్ అని మూవీ టీం తెలిపింది.