BigTV English

Thalaivar171: తలైవర్ తో లోకేష్.. విక్రమ్ ను మించి ఉండాలి రాజా

Thalaivar171: తలైవర్ తో లోకేష్.. విక్రమ్ ను మించి ఉండాలి రాజా


Thalaivar171: కోలీవుడ్ లో మాస్ కాంబో రెడీ అయ్యిపోయింది మావా.. ఎప్పుడెప్పుడు ఈ కాంబో ఓకే అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్- రజినీ కథ కాంబో సెట్ అయ్యింది. లోకేష్ ఈ మధ్యనే లియో సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు.  ఇక కమల్ కు విక్రమ్ తో హిట్ ఇచ్చింది లోకేష్ నే. ఇక ఇప్పుడు రజినీ వంతు. తలైవర్ 171 పేరుతో ఈ సినిమాను మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్  నిర్మిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. ఏప్రిల్ 22 న టైటిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇక ఈ పోస్టర్ లో రజినీ బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో కనిపించగా.. బంగారు వాచ్ లను  సంకెళ్లుగా పెట్టినట్లు చూపించారు. ఇక ఈ లుక్ లో తలైవా అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశాడు. గాగుల్స్.. డెనిమ్ షర్ట్ గుండీలు తీసి..  మెడలో లాకెట్.. అసలు నెక్స్ట్ లెవెల్ ట్రాన్సఫార్మేషన్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.


ఇక ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలను పెట్టుకున్నారు. జైలర్ తరువాత రజినీ ఆ రేంజ్ హిట్ అందుకున్నది లేదు. ఇక ఈ మధ్య  రిలీజ్ అయిన లాల్ సలాం కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో రజినీ ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు.  కమల్ కు విక్రమ్ ఇచ్చినట్లు.. రజినీకి అంతకు మించి ఇవ్వాలి లోకేష్ మావా అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమా కాకుండా రజినీ చేతిలో వేటాయాన్ సినిమా ఉంది. మరి ఈ సినిమాలతో రజినీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×