BigTV English

Bus Fall into Valley in South Africa: దారుణం.. లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి!

Bus Fall into Valley in South Africa: దారుణం.. లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి!
South Africa News
Bus Fell in Valley in South Africa

45 People Died in Bus Accident in South Africa: క్రిస్టియన్ల పవిత్రమైన పండుగ గుడ్ ఫ్రైడే వేళ దక్షిణాఫ్రికాలో విషాధ ఘటన వెలుగుచూసింది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. మొత్తం 46 మందితో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 45 మంది మృతి యెందగా, ఒక్క చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. దాదాపు 165 అడుగుల లోతులో బస్సు పడిపోయినట్లు అధికారులు తెలిపారు. లోయలో పడిన వెంటనే బస్సులో మంటలు చెరిగాయని అనంతరం బస్సు మొత్తం మంటల్లో కాలిపోయినట్లు తెలిపారు.


ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని లింపోపోలోని మమట్లకల సమీపంలో వెలుగుచూసింది. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే వీరంతా ఈస్టర్ పండుగ నేపథ్యంలో చర్చికి వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ప్రయాణికులు బస్సు బోట్స్వానా నుంచి లింపోపోలోని మోరియాకు వెళ్తుంది. అయితే ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు దక్షిణాఫ్రికా రవాణా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

Also Read: ఎఫ్-16 విమానాలను కూల్చేస్తాం.. నాటో దేశాలకు పుతిన్ హెచ్చరిక..


మృతదేహాలను సహాయచర్యలు చేపట్టి విపత్తు నిర్వాహక సిబ్బంది బయటకు తీస్తుంది. ఇందులో ఎనిమిదేళ్ల చిన్నారి గాయాలతో ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు.

Related News

Trump’s Tariff War: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Terroist Masood Azhar: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?

Big Stories

×