BigTV English

Kiss Song : ఒక్క ముద్దు కోసం ఇన్ని కష్టాలా? ఎక్కడో ఒక చోట పెట్టేయ్ సిద్ధూ..

Kiss Song : ఒక్క ముద్దు కోసం ఇన్ని కష్టాలా? ఎక్కడో ఒక చోట పెట్టేయ్ సిద్ధూ..

Kiss Song : టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి నుంచి ఈయన విభిన్న పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ముఖ్యంగా డీజె టిల్లు మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ మూవీకి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో సిద్దు క్రేజ్ అమాంతం పెరిగింది. సిద్దు జొన్నలగడ్డ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ప్రస్తుతం ఆయన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఈ మూవీ నుంచి తాజాగా రొమాంటిక్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


జాక్ సినిమాలో సిద్దు జొన్నలగడ్డతో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జోడి కట్టింది. ఇప్పటికే సిద్దు పుట్టినరోజు సందర్భంగా ‘జాక్’ సినిమా టీజర్ ను రిలీజ్ చేసి, అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారు. అలాగే ఏప్రిల్ 10న ఈ మూవీ ని థియేటర్లలోకి తీసుకురాబోతున్నామని అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేశారు.. మొన్న ఈ మూవీ నుంచి కిస్ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేయగా.. ఆ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. తాజాగా ఈ మూవీ నుంచి పూర్తి సాంగ్ ని రిలీజ్ చేశారు. అనుకున్న దానికంటే సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. లిరిక్స్ తో పాటు వైష్ణవి చైతన్య సిద్దు జొన్నలగడ్డ రొమాన్స్ కూడా హైలెట్ అయింది. సాంగ్ సెట్ మరో లెవల్ అనే చెప్పాలి. మొత్తానికైతే ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాలకి యూట్యూబ్ మొత్తానికైతే ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాలకి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.. ఆ సాంగ్ ఎలా ఉందో మీరు ఓ లుక్కేసుకోండి..

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘జాక్’ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది సురేష్ బొబ్బిలి, రధన్, అచ్చు రాజమణి, సామ్ సీఎస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల ఇవ్వబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ‘కిస్’ సాంగ్ రిలీజ్ అయ్యింది. భాగ్యనగరమంతా మనదే.. నీ బాధే తీరుస్తాను పదవే అంటూ సాగే సాంగ్ ను జావేద్ అలీ, అమల చేబోలు, సురేష్ బొబ్బిలి పాడారు.   రాజు సుందరం కొరియోగ్రఫీ అందించారు.. ఇక  ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. సిద్దు ఈ సినిమా తర్వాత టిల్లు క్యూబ్ సినిమాలో నటించనున్నాడు. ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని సిద్దు భావిస్తున్నాడు. ఆ తర్వాత మరో డైరెక్టర్ ని లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది..


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×