Murugadoss: మురుగదాస్ అంటే కమర్షియల్ సినిమాల్లోకూడా బలమైన కథలు చెప్పగల డైరెక్టర్. “గజినీ”, “తుపాకీ”, “కత్తి” సినిమాలతో ఆయన మార్క్ మేకింగ్ చూపించాడు. హీరోలను కొత్త యాంగిల్‌లో చూపిస్తూ, స్టైల్‌తో కూడిన నేరేటివ్‌తో సినిమాలు తీసే మురుగదాస్ టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. కానీ మహేష్ బాబుతో చేసిన “స్పైడర్” సినిమా అతని కెరీర్‌లో ఓ పెద్ద మిస్ ఫైర్ అయింది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో, మురుగదాస్ లాంటి టాప్ డైరెక్టర్ కాంబినేషన్ అంటే మినిమమ్ బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ అని అందరూ అనుకున్నారు. అయితే, ఊహించని విధంగా “స్పైడర్” సినిమా కథ, స్క్రీన్‌ప్లే పరంగా ప్రేక్షకులను కనెక్ట్ చేయలేకపోయింది. విజువల్స్, టెక్నికల్‌గా గ్రాండ్‌గా ఉన్నా, కంటెంట్ పరంగా పడిపోయిందనే కామెంట్స్ వచ్చాయి. మహేష్ కెరీర్‌లోనే అది ఓ పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
ఇలాంటి పెద్ద ఫ్లాప్ తర్వాత మురుగదాస్ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలను డైరెక్ట్ చేస్తున్నాడు. అందులో ఒకటి తమిళంలో శివ కార్తికేయన్‌తో, మరొకటి బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో. కోలీవుడ్‌లో శివ కార్తికేయన్ మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో. అతనితో మురుగదాస్ సినిమా అంటే ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కానీ అసలు హాట్ టాపిక్ అయింది సల్మాన్ ఖాన్ ప్రాజెక్ట్.
సల్మాన్ ఖాన్ అంటే బాలీవుడ్‌లో మాస్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యే హీరో. ఆయనతో మురుగదాస్ సినిమా అంటే భారీ అంచనాలు ఉండటం సహజం. “సికందర్” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈద్‌కు రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మాత్రం ఆశించిన స్థాయిలో పాజిటివ్ బజ్ క్రియేట్ చేయలేకపోయింది. టీజర్, సాంగ్స్ చూసిన వాళ్లలో చాలా మందికి “ఇది అసలు మురుగదాస్ సినిమానేనా?” అనే డౌట్ వచ్చేస్తోంది. ఎందుకంటే మురుగదాస్ సినిమాల్లో ఒక స్టైలిష్ మేకింగ్, కొత్తదనం ఉంటుంది. కానీ సికందర్ టీజర్, పాటలు చూస్తే ఓ రొటీన్ కమర్షియల్ ఫార్ములా సినిమాలో చూసే ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి.
సల్మాన్ ఖాన్ గత కొన్ని సినిమాలు అంతగా వర్కౌట్ కాలేదు. అందుకే “సికందర్” సినిమాపై ఆయన ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మురుగదాస్ కూడా తన బాలీవుడ్ కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి రావాలంటే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఈ సినిమా “స్పైడర్” మాదిరిగా డిజాస్టర్ అవ్వబోతోందా? అనే అనుమానం కలుగుతోంది. టీజర్, ట్రైలర్ వాయిస్ ఓవర్లలో కూడా పెద్దగా పంచ్ లేదని కొందరు చెబుతున్నారు. పాటలు కూడా ట్రెండింగ్ అవ్వలేదు. దీంతో బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమా మీద కాస్త నెగటివ్ టాక్ రాబట్టుకుంది.
ఇంతకు ముందు మురుగదాస్ బాలీవుడ్‌లో “గజినీ”తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ సినిమా 100 కోట్ల క్లబ్‌ను ఓపెన్ చేసిన సినిమాగా చెప్పుకోవచ్చు. అక్షయ్ కుమార్‌తో చేసిన హాలిడే మూవీ బాలీవుడ్‌లో పెద్దగా ఆడలేదు. ఇప్పుడు “సికందర్” కూడా అదే రిజల్ట్ సొంతం చేసుకోకుంటే చాలని మురుగదాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా హిట్ అయితే మురుగదాస్ మళ్లీ బాలీవుడ్‌లో నిలదొక్కుకోగలడు. లేకపోతే, ఇది బాలీవుడ్‌లో మురుగదాస్‌కి చివరి సినిమా అయ్యే అవకాశాలున్నాయి.