IPL 2025: మరో రెండు రోజులలో ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ కోసం అన్ని జట్లు సిద్ధమయ్యాయి. అయితే సాధారణంగా టి-20 ఫార్మాట్ అంటే టక్కున గుర్తుచేవి సిక్సర్లు, ఫోర్లు బ్యాటర్లు, బౌలర్లు. ఇక ఐపీఎల్ {IPL 2025} గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఐపిఎల్ లో సిక్స్ వచ్చినా, వికెట్ పడ్డా.. చీర్ లీడర్స్ {Cheerleaders Salary} చేసే హంగామా అంతా ఇంతా ఉండదు.
Also Read: Rohit Sharma: మాల్దీవుల్లో రోహిత్ సైక్లింగ్.. వీడియో వైరల్
ఐపీఎల్ లో మ్యాచ్ లు చూసేందుకు వచ్చిన అభిమానులను వీరు అలరిస్తూ డాన్స్ లు చేస్తుంటారు. మధ్య మధ్యలో జిమ్నాస్టిక్స్ కూడా చేస్తారు. మ్యాచ్ సందర్భంలో తమదైన శైలిలో స్టెప్పులేస్తూ అభిమానులను, ప్రేక్షకులను కనువిందు చేస్తుంటారు చీర్ లీడర్స్. క్రికెట్ ఆడేవాళ్లను ఉత్సాహపరచడం, మ్యాచ్ చూసేందుకు వచ్చిన వాళ్ళను ఉల్లాసపరచడం చీర్ లీడర్స్ కర్తవ్యం. మ్యాచ్ నిరాశగా సాగుతున్నప్పుడు, ప్రేక్షకులు డీలా పడ్డప్పుడల్లా ఈ చీర్ లీడర్లు ప్రత్యక్షమై ఆడి,పాడి స్టేడియం లోపల బయట చురుకు పుట్టించి అదృశ్యమైపోతారు.
క్రికెట్ బాగా పాపులర్ అయ్యాక ఈ చీర్ లీడర్ల సాంప్రదాయం ప్రపంచ దేశాలన్నిటికీ విస్తరించింది. నిజానికి ఈ సాంప్రదాయం క్రికెట్ తో మొదలవలేదు. అంతేకాకుండా అసలు ఆడవాళ్ళతోనే మొదలు కాలేదు. 1898లో ప్రిన్స్ టర్న్ యూనివర్సిటీ పట్టబద్రుడు థామస్ పిబిల్స్ అమెరికన్ ఫుట్ బాల్ టీం ని ఉత్సాహపరిచేందుకు ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని భావించాడు. ఫుట్బాల్ అభిమానులను ఆనందంలో ముంచేత్తేందుకు ఒక లీడర్ ఉంటే బాగుంటుందని అనుకున్నాడు.
దీంతో వెంటనే జానీ కాంప్ బెల్ అనే విద్యార్థి నేను ఉంటాను అని ముందుకు వచ్చాడు. మ్యాచ్ మధ్యలో పెద్దగా అరిచి, విజిల్స్ వేసే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించాడు. తద్వారా తొలి చీర్ లీడర్ అయ్యాడు. అలా ఈ చీర్ లీడర్స్ సాంప్రదాయం మొదలైంది. అయితే మీకు ఈ చీర్ లీడర్స్ {Cheerleaders Salary} సంపాదన గురించి మీకు ఏమైనా తెలుసా..? ఐపీఎల్ లో ఈ చీర్ లీడర్ల పైన కూడా కనక వర్షం కురుస్తుంది. వివిధ ఐపిఎల్ జట్లు చీర్ లీడర్లకు వేరువేరు జీతాలు చెల్లిస్తూ ఉంటాయి.
Also Read: Rohit Sharma: కెప్టెన్సీ మూడ్ లో రోహిత్… ఎయిర్ పోర్టులో ఫీల్డింగ్ చేస్తూ !
ప్రతి మ్యాచ్ కి లేదా ఒకేసారి సీజన్ మొత్తానికి ఈ చీర్ లీడర్లను మాట్లాడుకుంటాయి. మీడియా నివేదికల ప్రకారం ఐపీఎల్లో చీర్ లీడర్లు సగటున ఒక్కో మ్యాచ్ కి రూ. 14 వేల నుండి 17వేల వరకు సంపాదిస్తారు. అయితే ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు మాత్రం చీర్ లీడర్స్ కి ఒక్కో మ్యాచ్ కి 20వేల రూపాయలు చెల్లిస్తాయి. అంతేకాకుండా వీరు జీతంతో పాటు బోనస్ లను కూడా అందుకుంటారు. అలాగే వీరికి వసతి, భోజన సౌకర్యాలను కూడా కల్పిస్తారు.