E-Paper
Advertisement

Singareni Jung Siren: యదార్థ సంఘటనల నేపథ్యంలో ‘సింగరేణి జంగ్ సైరన్’..

Singareni Jung Siren: యదార్థ సంఘటనల నేపథ్యంలో ‘సింగరేణి జంగ్ సైరన్’..
Advertisement

Singareni Jung Siren: ‘జార్జి రెడ్డి’ సినిమాతో యూత్ ఐకాన్‌గా మారిపోయారు దర్శకుడు జీవన్ రెడ్డి. ఆయన ఈ సినిమాను తెరకెక్కించి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను అందుకున్నారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ మూవీ డైరెక్టర్ జీవన్ రెడ్డి మరొక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

అయితే ఈ సారి దర్శకుడిగా కాదు.. ఆయన రాసి ఇచ్చిన కథతో ఓ సినిమా రాబోతుంది. అదే ‘సింగరేణి జంగ్ సైరెన్’. ‘ది అండర్ గ్రౌండ్ లైవ్స్’ అనేది ట్యాగ్ లైన్. జీవన్ రెడ్డి ఇచ్చిన కథతో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుంది. ధూమ్ర వారాహి బ్యానర్‌పై కొత్త దర్శకుడు వివేక్ ఇనుగుర్తి ఈ మూవీకి డైరెక్షన్ బాధ్యతలు తీసుకున్నాడు.

Advertisement

సింగరేణిలో 1999లో జరిగిన యదార్థ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఆల్రెడీ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయి. అతి త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి రానుంది. ఈ మూవీలో నటీ, నటులకు సంబంధించిన పూర్తి వివరాలను ‘ప్రపంచ కార్మిక దినోత్సవం(మే డే) రోజున వెల్లడించనున్నారు.

Also Read: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌పై కేసు నమోదు..!

Advertisement

యదార్థ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కబోతున్న సినిమా కాబట్టి దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. అందులోనూ క్రేజీ దర్శకుడు జీవన్ రెడ్డి కథ ఒక విషయమైతే.. కొత్త దర్శకుడు మరొక విషయం. ఇలా మొత్తంగా చూసుకుంటే సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్‌ను అందుకుంటుందని ప్రేక్షకాభిమానులు భావిస్తున్నారు.

ఇక ఈ మూవీ టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. ప్రసన్న దంతులూరి కాస్ట్యూమ్, లాటి ఫ్లింకారీ అసొసియేట్ రైటర్, హరీశ్ మధురెడ్డి ఎడిటింగ్, రాకీ వనమాలి సినిమాటోగ్రఫీ, సేగు వికాస్ స్టిల్స్, మధు అర్జ్ వీఎఫ్ఎక్స్, సురేష్ బొబ్బిలి మ్యూజిక్, లలన్ మహేంద్ర, టి. మురళి రఘవరన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, జీఎస్ కె మీడియా (సురేష్, శ్రీనివాస్)లు పీఆర్ఓగా, కథ జీవన్ రెడ్డి, దర్శకత్వం వివేక్ ఇనుగుర్తి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×