Big Stories

Chidambaram on Modi: ఆ పార్టీ అంతా మోదీని పూజించే వారే: చిదంబరం!

Congress Leaded Chidambaram Comments on Modi and BJP: బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తీవ్ర విమర్శలు చేశారు. మోదీ పాలనలో ప్రజా హక్కులు హరించారని ఆరోపించారు. రాజకీయ పార్టీలా కాకుండా బీజేపీ మోదీని ఆరాదించే బ్యాచ్ లా మారిందని అన్నారు. బీజేపీ మేనిఫెస్టోకు మోదీ హామీ అని పేరు పెట్టారని తెలిపారు.

- Advertisement -

పదేళ్ల ఎన్డీయే పాలనలో వాక్ స్వాతంత్ర్యపు హక్కుతో పాటు, భావ ప్రకటనా స్వేచ్ఛలు హరించారని మండిపడ్డారు. బీజేపీ మేనిఫెస్టోపై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకు పడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పౌరసత్వ సవరణ చట్టం CAAను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మరో సారి మోదీ అధికారంలోకి వస్తే..రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉందని అన్నారు.

- Advertisement -

ALSO READ: మహవీర్ జయంతి.. 2550వ నిర్వాణ మహోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..

దేశంలో నిరుద్యోగం ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారిందని తెలిపారు.తమిళనాడులోని 39 స్థానాలతో పాటు పాండిచ్చేరిలో ఒక స్థానంలో కూటమి గెలుస్తుందని అన్నారు. 14 రోజుల్లో బీజేపీ మేనిఫెస్టో తయారు చేసిందని తెలిపారు. బీజేపీ పూర్తిగా మత తత్వ పార్టీగా మారిందని, అందులోని వారంతా మోదీని ఆరాదిస్తున్నారని ఆరోపించారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చిదంబరం ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. వయనాడ్ ప్రజలు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దేశ ప్రజలు కాంగ్రెస్ గెలుపు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News