E-Paper
Advertisement

Case Filed on Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌పై కేసు నమోదు..!

Case Filed on Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌పై కేసు నమోదు..!
Advertisement

Case Filed on Tamil Actor Thalapathy Vijay: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. ఆల్రెడీ ఏప్రిల్ 19న పలు రాష్ట్రాల్లో మొదటి విడత పోలింగ్ జరిగింది. అందులో తమిళనాడు రాష్ట్రం కూడా ఉంది. అయితే ఇదే క్రమంలో చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో దళపతి విజయ్‌పై కేసు నమోదైంది. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తమిళనాడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్టార్ హీరో దళపతి విజయ్ రష్యాలో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి చెన్నై వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరి డైరెక్ట్‌గా నీలాంగరై పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. ఇక అతడిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పరుగులు తీశారు. పోలింగ్ బూత్ వద్ద విజయ్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఎడబడ్డారు. అయితే ఈ పోలింగ్ బూత్ వద్దకు విజయ్‌తో పాటు ఆయన అనుచరులు, మద్దతుదారులు దాదాపు 200 మందికి పైగా వచ్చారు.

Advertisement

దీంతో ఓ వైపు అనుచరులు, మద్ధతుదారులు.. మరోవైపు అభిమానుల హడావుడితో అక్కడ అంతా గందరగోళంగా మారింది. అదే క్రమంలో అక్కడ ఓటు వేయడానికి వచ్చిన సాధారణ ఓటర్ల సైతం తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. అయితే ఇదే విషయమై సెల్వం అనే వ్యక్తి.. హీరో విజయ్‌పై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. విజయ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాడని ఫిర్యాదు చేశాడు.

Also Read: దళపతి విజయ్ పార్టీ పేరులో మార్పులు.. కారణం ఏంటంటే?

Advertisement

విజయ్ వల్ల తమకు ఇబ్బందికలిగిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. విజయ్ ఎన్నికల నియమాళిని ఉల్లంఘించడంతో పాటు 200 మందితో పోలింగ్ కేంద్రలోకి వెళ్లారని కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో అందుకు సంబంధించిన వార్త బయటకొచ్చి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై విజయ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. కాగా విజయ్ ఇటీవలే ‘కళుగు’ అనే పేరుతో ఓ పార్టీని పెట్టిన సంగతి తెలిసందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×