PM Modi Vs Karnataka CM Siddaramaiah: కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ‘నీటి రాజకీయం’ చెలరేగింది. కేంద్ర అధికార పార్టీ, రాష్ట్ర అధికార పార్టీ మధ్య ‘ఖాళీ చెంబు’ రాజకీయం ఊపందుకుంది. దీంతో ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ టెక్ సిటీని ట్యాంకర్ సిటీగా మార్చారంటూ కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తిప్పికొట్టారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. టెక్ సిటీని ట్యాంకర్ సిటీగా మార్చే ఘనత కాంగ్రెస్ సర్కార్ కే దక్కు తుందని మోదీ ఎద్దేవా చేశారు. మోదీ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. వరదలు, కరువుతో కర్ణాటక ఇబ్బంది పడుతుంటే అప్పుడు మోదీ ఎక్కడున్నారని ప్రశ్నించారు.
బీజేపీ దేశాన్ని ప్రగతి పథంలో తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం మోదీని గద్దె దించడానికి ప్రయత్నాలు చేస్తోందన్నారు. కర్ణాటకను కాంగ్రెస్ ప్రభుత్వం యాంటీ ఇన్వెస్టిమెంట్, యాంటీ ఎంట్రప్రెన్యూర్ షిప్, యాంటీ ప్రైవేట్ సెక్టార్, యాంటీ టాక్స్ పేయర్ గా మార్చిందని మోదీ ఆరోపణలు చేశారు.
Also Read: ఆ పార్టీ అంతా మోదీని పూజించే వారే: చిదంబరం
కాగా, ఇటీవలే కార్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రం ఏం ఇవ్వలేదని చూపుతూ.. కేవలం ఖాళీ చెంబును చూపిస్తూ ఓ యాడ్ చేసింది. ఈ తర్వాత ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జేడీఎస్ చీఫ్ దేవెగౌడ్ ఓ సభలో కూర్చుని ఖాళీ చెంబు యాడ్ ను న్యూస్ పేపర్ లో చూపిస్తున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. దేవెగౌడ చూపిస్తున్న ఆర్ట్ కు ప్రధాని మోదీ ఆర్టిస్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
దీనిపై బీజేపీ స్పందిస్తూ.. కాంగ్రెస్ కు కౌంటర్ ట్వీట్ చేసింది. 2013లో సిద్ధరామయ్య చేతిలో చెంబు పట్టుకున్నట్లు.. 2023లో ఆయన చేతిలో చెంబు లేన్నట్లు ఉన్న ఫోటోను ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ రెండు ఫోటోల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది అంటూ బీజేపీ క్యాప్షన్ ఇచ్చింది.
Also Read: Water Crisis: బెంగుళూరు తర్వాత కోల్‌కత్తా, నెక్ట్స్ హైదరాబాదేనా?
Shri Devegowda showing the Art to the Artist!!#BJPChombuSarkara pic.twitter.com/mcr72k5rZt
— Siddaramaiah (@siddaramaiah) April 20, 2024
ವ್ಯತ್ಯಾಸ ಇಷ್ಟೇ!
The Difference Is Very Clear!#ModiKiGuarantee pic.twitter.com/TOv3Kjk9Ji
— BJP Karnataka (@BJP4Karnataka) April 20, 2024