BigTV English

Chinmayi vs Anasuya : ఛీఛీ.. చిన్నపిల్లాడితో అనసూయ లిప్ కిస్.. సిగ్గులేదా అంటూ చిన్మయి ఫైర్

Chinmayi vs Anasuya : ఛీఛీ.. చిన్నపిల్లాడితో అనసూయ లిప్ కిస్.. సిగ్గులేదా అంటూ చిన్మయి ఫైర్

Chinmayi Sripada Post on Anasuya : చిన్మయి శ్రీపాద.. అనగానే ఆమె పాటలతో పాటు ఆమె చుట్టూ ఉన్న వివాదాలు కూడా గుర్తొస్తాయి. ఎక్కడ ఏ సమస్య ఉన్నా అంతా తనకే కావాలని రెస్పాండ్ అవుతుందామె. సలార్ నటుడు జాన్ విజయ్ పై లైంగిక ఆరోపణలు చేసి తాజాగా వార్తల్లో నిలిచిన చిన్మయి శ్రీపాద.. ఇప్పుడు ఒక ఫేమస్ లేడీ యాంకర్ పై ఫైర్ అవుతూ ఇన్ స్టా లో పెట్టిన పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.


మీరు అనుకుంటున్నది కరెక్టే. ఆ లేడీ యాంకర్ ఎవరో కాదు. అనసూయ భరద్వాజ్. నెటిజన్లు ఈమెను ఎప్పుడూ ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ విషయంలో ఆ మధ్య కొన్ని వ్యాఖ్యలు చేసి.. తీవ్రమైన ట్రోలింగ్ ను ఎదుర్కొంది. జబర్దస్త్ షో లో యాంకర్ గా వచ్చిన అనసూయ బాగా పాపులర్ అయింది. అయితే చాలా కాలంగా ఆ షో కూడా హోస్ట్ చేయడంలేదు. బుల్లితెరపై ఏ షో లోనూ అనసూయ కనిపించడం లేదు. ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టింది.

మరి చిన్మయి శ్రీపాద అనసూయపై ఎందుకంత ఫైర్ అయిందని అనుకుంటున్నారా. ఓ బుల్లితెర షో లో అనసూయ చిన్న పిల్లాడిని ఎత్తుకుని తన మొహం చూపించి.. ఇక్కడ ముద్దు పెట్టు.. అక్కడ ముద్దు పెట్టు అంటూ కిసెస్ పెట్టించుకున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియో పైనే చిన్మయి ఫైర్ అవుతూ ఇన్ స్టా లో పోస్ట్ పెట్టింది. డైరెక్ట్ గా అనసూయ పేరు పెట్టకపోయినా .. ఆమెను టార్గెట్ చేస్తూనే ఆ పోస్ట్ చేసింది.


Also Read : రియల్ గానే ‘కల్కి’ని కనబోతున్న దీపిక?

ఒక చిన్న పిల్లాడిని ఇలా పెదాలపై ముద్దు పెట్టమని అడగడం సిగ్గుచేటని పేర్కొంది. పైగా ఆ షో లో ఉన్న ఆడియన్స్, పేరెంట్స్ కూడా.. ఆ పిల్లాడు ముద్దులు పెడుతుంటే కేరింతలు, క్లాప్స్ కొడుతుండటం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని పేర్కొంది. చిన్నపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాల్సిన తల్లిదండ్రులే ఇలాంటి పనులు చేస్తుంటే చూస్తూ ఉండటం సరైన పద్ధతి కాదని, ఇది అతని భవిష్యత్ పై ప్రభావం చూపుతుందని చెప్పుకొచ్చింది.

ఇలాంటి కంటెంట్ తో టీవీ ఛానల్స్ లో కిడ్స్ షో లు, కామెడీ షో లు చేస్తుండటం చూస్తుంటే భయమేస్తుందని, సమాజం దీనిని ఎంతమాత్రం ప్రోత్సహించకూడదని చిన్మయి తెలిపింది. మీ పిల్లలకు ఏది మంచో ఏది చెడో చెప్పాల్సింది మీరేనని తల్లిదండ్రులకు సూచించింది. చిన్మయి పోస్ట్ పై నెటిజన్లు అలాగే స్పందిస్తున్నారు. ఒక యాంకర్ అయి ఉండి అనసూయ ఇలాంటి పనులు చేయడం ఏమీ బాగోలేదని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతకీ నెట్టింట వైరల్ అవుతున్న అనసూయ వీడియో చాలా సంవత్సరాల క్రితంది. 2013-14 సంవత్సరాల్లో ఇది ప్రముఖ ఛానల్ లో టెలీకాస్ట్ అయింది. మరి చిన్మయి పోస్ట్ పై అనసూయ భరద్వాజ్ ఎలా స్పందిస్తుందో.. ఈ వివాదం ఎంతవరకూ వెళ్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×