BigTV English

Hyundai Upcoming Cars: ప్రత్యేకంగా పండుగ సీజన్.. హ్యుందాయ్ రెండు కొత్త కార్లు.. రేంజ్ చూస్తే షాక్ అవుతారు!

Hyundai Upcoming Cars: ప్రత్యేకంగా పండుగ సీజన్.. హ్యుందాయ్ రెండు కొత్త కార్లు.. రేంజ్ చూస్తే షాక్ అవుతారు!

Hyundai Upcoming Cars: ఈ ఏడాది దేశయ ఆటోమొబైల్ మార్కెట్‌లో కీలకంగా మారింది. జనవరి నుంచి ఇప్పటి వరకు మార్కెట్‌లోకి కంపెనీలు కొత్త కొత్త కార్లను తీసుకొచ్చాయి. ఇక రానున్న ఆరు నెలలు కూడా చాలా ప్రత్యేకంగా ఉండనుంది. ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో అనేక కొత్త మోడల్స్ మార్కెట్‌లో సందడి చేయనున్నాయి. వీటిలో హ్యుందాయ్ మోటర్ ఇండియా కూడా ఉంది. కంపెనీ రెండు కొత్త ఎస్‌యూవీలను విడుదల చేయనుంది. అందులో హ్యుందాయ్ క్రెటా ఈవీ, అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ ఉన్నాయి.


Hyundai Alcazar Facelift
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ ఏడాది సెప్టెంబర్‌లో తన ప్రీమియం SUV అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. టెస్టింగ్ సమయంలో ఇది చాలా సార్లు కనిపించింది. దీనిలో దాని ఎక్స్టీరియర్ డిజైన్‌తో పాటు ఇతర డిజైన్‌లను చూడొచ్చు. కొత్త మోడల్‌లో కొత్త ఫ్రంట్ స్లీక్ గ్రిల్, డ్యూయల్ ప్రొజెక్టర్ LED హెడ్‌లైట్లు, బంపర్, బానెట్ ఉంటాయి. ఇది కాకుండా కారులో రిఫ్రెష్ చేసిన అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి.


ఇంటీరియర్ గురించి మాట్లాడితే కొత్త మోడల్‌ చాలా కొత్తగా కనిపిస్తుంది. క్యాబిన్ లేఅవుట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. కొత్త క్రెటా ఓవర్ వ్యూలో దీన్ని చూడొచ్చు. ఇందులో డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది.  మోడల్‌లో 6, 7 సీట్ల వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. సేఫ్టీ పరంగా ఇది 2 స్టేజ్ ADASతో సహా అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది . కొత్త ఆల్కాజర్‌లో 1.5L,  2.0L ఇంజన్ ఆప్షన్స్ చూడొచ్చు. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ని కలిగి ఉంటుంది.

Hyundai Creta EV
మిడ్ సైజ్ ఎస్‌యూవీలలో హ్యుందాయ్ క్రెటా చాలా ప్రజాదరణ పొందింది. ఇప్పుడు క్రెటా ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ లాంచ్ కానుంది. కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ EV, మారుతి EVX లకు గట్టి పోటీనిస్తుంది. డిజైన్ గురించి మాట్లాడితే పెట్రోల్ మోడల్‌తో పోలిస్తే క్రెటా EV డిజైన్‌లో పెద్ద మార్పులు చూడవచ్చు. దీని ముందు భాగం కొత్త గ్రిల్ నుండి హెడ్‌లైట్లు, కొత్త టెయిల్‌లైట్లు, బంపర్‌లకు కొత్త టచ్‌ను పొందుతుంది.

ఇంటీరియర్ గురించి మాట్లాడితే క్రెటా EV‌లో కొత్త 2 స్పోక్ స్టీరింగ్ వీల్‌ ఉంటుంది. దానిపైనే డ్రైవింగ్ మోడ్‌లను మార్చుకునే ఫీచర్ అందుబాటులో ఉంటుంది. స్పై షాట్‌లను పరిశీలిస్తే ఇందులో ADAS,  360 డిగ్రీ కెమెరాలు ఉంటాయి. కారులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే ఆండ్రాయిడ్ ఆటో, 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్, డాష్‌క్యామ్, క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లు ఉన్నాయి.

Also Read: Nissan Magnite Facelift: వామ్మో.. ఇదేం ఎస్‌యూవీ భయ్యా.. ఫీచర్లు చూస్తే మతిపోతుంది!

కొన్ని నివేదికల ప్రకారం క్రెటా EV కూడా KONA EV వలె అదే ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ కలిగి ఉంటుంది. ఇందులో ముందు భాగంలో అమర్చబడిన ఎలక్ట్రిక్ మోటార్, 45 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటాయి. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ 45kWh బ్యాటరీ ప్యాక్‌‌తో వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 450 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తోంది. క్రెటా EVని ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయవచ్చు. క్రెటా EV ధర రూ. 22 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Related News

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Big Stories

×