E-Paper
Advertisement

Singer Magli: మ‌ళ్లీ కాంట్ర‌వ‌ర్సీలో మంగ్లీ

Singer Magli: మ‌ళ్లీ కాంట్ర‌వ‌ర్సీలో మంగ్లీ
Advertisement

Singer Magli:సింగ‌ర్ మంగ్లీ త‌న పాట‌ల‌తో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అయితే ఇప్పుడామె చుట్లూ వివాదాలు కూడా ముసురుకుంటున్నాయి. మొన్న‌టికి మొన్న క‌ర్ణాట‌క‌లో ఆమె క‌న్న‌డ మాట్లాడ‌టం లేదంటూ అభిమానులు ఆమె కారుపై దాడి చేసినట్లు వార్త‌లు వచ్చాయి. కాగా.. ఇప్పుడు మంగ్లీ మ‌రో వివాదంలో చిక్కుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. సాధార‌ణంగా ప్ర‌తీ శివ‌రాత్రికి మంగ్లీ శివుడిపై త‌న భ‌క్తిని చాటుకుంటూ పాట పాడుతుంటుంది. అలాగే ఆమె ఈసారి శ్రీకాళ‌హ‌స్తిలోని కాళ భైర‌వ స్వామి ఆల‌యంలో పాట పాడ‌గా చిత్రీక‌రించారు. అయితే ఇప్పుడ‌దే వివాదంగా మారింది.

కెమెరాలు, సెల్ పోన్స్‌కు అనుమ‌తి లేని కాల భైర‌వ స్వామి ఆల‌యం, రాహుకేత మండ‌పంలో మంగ్లీ పాట‌ను ఎలా చిత్రీక‌రిస్తార‌నేది భ‌క్తులు వేస్తున్న ప్ర‌శ్న‌. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఆల‌య అధికారులు కూడా స్పందిచక‌పోవ‌టం అనేది వివాదానికి దారి తీస్తోంది. అస‌లు ఆల‌యంలో చిత్రీక‌ర‌ణ‌కు ఎవరు అనుమ‌తి ఇచ్చార‌నేది అంద‌రూ వేస్తున్న ప్ర‌శ్న‌. స్థానిక ఎమ్మెల్యే, ఆల‌య ఈవోకి తెలియ‌కుండానే ఇదెలా సాధ్య‌మైందంటూ భ‌క్తులు ప్ర‌శ్నిస్తున్నారు. ఇలా చేయ‌టం హిందువుల మ‌నో భావాల‌ను దెబ్బ తీసిన‌ట్లేన‌ని హిందూ సంఘాలు అంటున్నాయి. మ‌రి దీనిపై అక్క‌డున్న ఆల‌య పాల‌క మండ‌లి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

భ‌క్తిని ప్ర‌ద‌ర్శించుకోవ‌టంలో త‌ప్పేమీ లేదు. అయితే ఇలా దాన్ని వివాదాస్పదంగా మార్చుకోవ‌టం స‌మ్మ‌తం కాదు. ఇత‌రుల‌కు అనుమ‌తి లేని ఇవ్వ‌ని అధికారులు మంగ్లీకి మాత్రం ఎలా ప‌ర్మిష‌న్ ఇస్తార‌నేది ఇప్పుడు వాద‌న అంశంగా మారింది. రేపు మ‌రి ఈ వివాదం ఎన్ని మ‌లుపులు తీసుకుంటుందో చూడాలి.

Astrologer Venu Swamy:తార‌క‌ర‌త్న చ‌నిపోతాడ‌ని ఆస్ట్రాల‌జ‌ర్ వేణుస్వామికి ముందే తెలుసా?

Advertisement

Bhumi Pednekar: మ‌హేష్ సినిమాలో బాలీవుడ్ గ్లామ‌ర్ డాల్‌

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×