SP Sailaja: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న విషయం తెల్సిందే. తిరుపతి లడ్డూ వివాదం జరిగిన వెంటనే.. అది అపరాధ భావంగా భావించిన పవన్ కళ్యాణ్.. స్వామివారి విషయంలో జరిగిన దానికి తాను బాధ్యత వహిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టినట్లు తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే తిరుపతి మెట్లను శుభ్రం చేస్తూ.. స్వామివారికి సేవ చేస్తున్నారు.
ఇక సనాతన ధర్మం గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా.. పవన్ ఊరుకోవడం లేదు. ఇక పవన్ ప్రవర్తనపై నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు . సనాతన ధర్మం అంటాడు.. చెప్పులు వేసుకొని వెళ్తాడు. గతంలో లడ్డూ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. ఇప్పుడు అదే లడ్డూ గురించి తప్పుగా మాట్లాడకపోయినా.. క్షమాపణలు చెప్పించుకుంటున్నాడు. ఒకసారి హిందూ అంటదు.. ఇంకోసారి క్రిస్టియన్ అంటాడు.. అసలు పవన్ కు ఏమైంది అని వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారు.
Actor Siddhique : లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్… పరారీలో ఉన్న నటుడిపై లుక్ అవుట్ నోటీసులు
ఇక మరికొంతమంది మాత్రం పవన్ కు సపోర్ట్ గా నిలబడుతున్నారు. పవన్ చేసిన దాంట్లో తప్పులేదని మద్దతు పలుకుతున్నారు. తాజాగా స్టార్ సింగర్ ఎస్పీ శైలజ సైతం పవన్ వెనుక నిలబడింది. పవన్ కళ్యాణ్ చేసింది తప్పు కాదు.. వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చింది.
ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ” ఎవరి ధర్మం వాళ్లకు ముఖ్యం. పవన్ కళ్యాణ్.. అది నా ధర్మం అనుకోని చేస్తున్నారు. మధ్యలో ఆయనను మనం వేలెత్తి చూపించే విషయమే లేదు. ఆయన మనస్ఫూర్తిగా.. ఇలా చేస్తే నా స్వామికి ప్రక్షాళన కలుగుతుందని నమ్మి ఆ దీక్ష చేపట్టారు. స్వామివారి విషయంలో చేసిన తప్పు.. ఒకరు చేశారో.. ఇద్దరు చేశారో.. ఎంతమంది చేశారో అనేది తెలియదు. కానీ , ఆ తప్పుకు ప్రక్షాళన అవుతుందని పవన్ ఇలా చేశారు. అది ఆయన ధర్మం. ఆ విషయాన్ని పవన్ మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. చేయనివ్వండి.. తప్పేముంది.
Devara: బ్లాక్ మార్కెట్ ఆరోపణలు.. ఆ థియేటర్ లో తనిఖీలు
మనకు చేతనైతే సహాయం చేయాలి. లేకపోతే ఊరకే నిలబడి చూద్దాం.. ఏం జరుగుతుందో. మంచి పని చేస్తున్నారు కదా.. ఇంకా కాంట్రవర్సీస్ ఏం లేవు. ఇంకేదైనా ఉంటే భగవంతుడు చూసుకుంటాడు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక శైలజ వ్యాఖ్యలను చాలామంది సమర్థిస్తున్నారు. మంచి మాటలు చెప్పారు. ఆమె చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని చెప్పుకొస్తున్నారు.