BigTV English

Jigra Trailer: తమ్ముడి కోసం చావడానికి సిద్ధమయిన ఆలియా.. తనలో ఈ యాంగిల్ ముందెప్పుడూ చూసుండరు!

Jigra Trailer: తమ్ముడి కోసం చావడానికి సిద్ధమయిన ఆలియా.. తనలో ఈ యాంగిల్ ముందెప్పుడూ చూసుండరు!

Jigra Official Trailer : ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అది కూడా ఒక స్టార్ హీరోయిన్.. స్క్రీన్‌పై యాక్షన్, ఫైట్స్ చేయడం చూస్తుంటే ఆడియన్స్‌కు మరింత మజా వస్తుంది. దానికోసమే ఆలియా భట్ సిద్ధమయ్యింది. ‘జిగ్రా’ అనే మూవీతో తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి వచ్చేస్తోంది ఆలియా భట్. ఇప్పటికే ఈ మూవీ ఒక అక్క, తమ్ముడి మధ్య అనుబంధంపై తెరకెక్కిందని అందరికీ క్లారిటీ వచ్చేసింది. కానీ ఆ అనుబంధం ఏ లెవెల్‌లో ఉంటుందో తెలియాలంటే తాజాగా విడుదలయిన ‘జిగ్రా’ ట్రైలర్ చూడాల్సిందే.


ఉరిశిక్ష

‘జిగ్రా’లో ఆలియా భట్.. సత్య అనే పాత్రలో నటించగా తన తమ్ముడు అంకుర్‌గా వేదాంగ్ రైనా నటించాడు. ఆలియాకు తన తమ్ముడు దగ్గర నుండి ఫోన్ కాల్ రావడంతో ట్రైలర్ మొదలవుతుంది. ‘అంకుర్. నువ్వేమైనా చేశావా? ఏమైనా టచ్ చేశావా? ఏమైనా తిన్నావా? నీ ఫోన్‌తో ఎవరైనా కాల్స్ చేశారా? బ్లండ్ శాంపుల్ తీసుకుంటే క్లీన్ అనే వస్తుంది కదా.. నువ్వు భయపడకు. నీకేం కాదు’ అంటూ తన తమ్ముడికి ఫోన్‌లోనే ధైర్యం చెప్తుంది ఆలియా. డ్రగ్స్ తీసుకున్న కేసులో వేదాంగ్‌కు మూడు నెలలు జైలుశిక్ష, ఆ తర్వాత ఉరి తీయాలని కోర్టు తీర్పునిస్తుంది. తను వేరే దేశంలో ఉండడంతో ఆ తీర్పు ఏంటో కూడా వేదాంగ్‌కు అర్థం కాదు.


Also Read: ఎన్ కౌంటర్ చేయడం హీరోయిజమా.. రజినీ- అమితాబ్ ల మధ్య యుద్ధం వేరే లెవెల్

చావడానికి సిద్ధం

తప్పుడు కేసులో తమ్ముడిని జైలుకు తీసుకెళ్లారని తనను కలవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఆలియా. ఆఖరికి తన చేయి కట్ చేసుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. ఆలియా భట్ ఫ్రెండ్ పాత్రలో రాహుల్ రవీంద్రన్ కనిపించాడు. తను ఆలియాను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినా కూడా తను మాత్రం తన తమ్ముడిని ఒక్కసారి అయినా కలవాలని ఫిక్స్ అయిపోతుంది. అక్కడే యాక్షన్ మొదలవుతుంది. చావు, బ్రతుకుల మధ్య ఉంటే తన తమ్ముడిని కలవచ్చనే ఉద్దేశ్యంతో కావాలని గాయాలపాలవుతుంది. ఆరోగ్యం దెబ్బతినాలని లిమిట్ లేకుండా తింటుంది. ఏం చేసినా లాభం లేకపోవడంతో ఏకంగా జైలునే బద్దలుకొట్టి తమ్ముడిని కాపాడుకోవాలని అనుకుంటుంది.

ఎమోషనల్ రైడ్

‘జిగ్రా’ ట్రైలర్ అంతా దాదాపుగా యాక్షన్‌తోనే నిండిపోయింది. కానీ చివర్లో మాత్రం అక్క, తమ్ముడి మధ్య ఉంటే అనుబంధం ఎలా ఉంటుందో చెప్తూ ఎమోషనల్ నోట్‌తో ముగించాడు. జైలులో ఉన్న తమ్ముడిని కలవడానికి ఆలియా వెళ్తుంది. ‘‘నిన్ను లోపల ఎవరూ ఇబ్బంది పెట్టడం లేదు కదా’’ అని తనను అడగగా.. ‘‘నువ్వు నా అక్క అయినప్పుడు ఎవరైనా నన్ను ఎలా ఇబ్బందిపెట్టగలరు. నువ్వు లక్షల్లో ఒకదానివి’’ అని చెప్తాడు. చిన్నప్పటి నుండి తన తమ్ముడిని ఆలియా ఎలా కాపాడుకుంటుందో కూడా ఈ ట్రైలర్‌లో చూపించారు. ‘‘నేను మామూలు మనిషిని అని నేనెప్పుడూ చెప్పలేదు. నేను కేవలం అంకుర్ అక్కను మాత్రమే’’ అని ఆలియా చెప్పే డైలాగ్‌తో ‘జిగ్రా’ ట్రైలర్ ముగుస్తుంది. వసన్ బాలా తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×