Suchi Leaks : తమిళ స్టార్ హీరో విశాల్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. మొన్న జరిగిన ఈవెంట్లో ఆయన బక్క పలచగా అవ్వడంతో పాటు వణుకుతూ ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు కనిపించాడు అయితే ఆయన అనారోగ్యం పై అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. కానీ వైద్యులు మాత్రం ఆయన ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చారు. రీసెంట్గా తమిళ నటి కుష్బూ విశాల్ ఆరోగ్యం పై ఆయన అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. ఇక తాజాగా వివాదాస్పద సింగర్ సుచిత్ర అనారోగ్య సమస్యలు విని సంతోష పడినట్లు నెట్టింట ఓ వార్త షికారు చేస్తుంది. అసలు సుచిత్ర ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం…
విశాల్ ఆరోగ్య సమస్యలు..
తమిళ హీరో విశాల్ నటించిన మదగజ రాజా చిత్రం 12 ఏళ్ల తర్వాత రిలీజ్ కు సిద్ధమైంది. మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఒక ఈవెంట్ ని నిర్వహించారు. ఆ ఈవెంట్ కు హీరో విశాల్ హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో విశాల్ నడవడానికి, నిల్చొవడానికి చాలా ఇబ్బందిపడ్డారు. ఆయన పరిస్థితి చూసి అందరు బాధపడ్డారు. కానీ అతని బాధను చూసి సింగర్ సుచిత్ర సంతోషంగా ఫీల్ అయ్యింది. ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.
విశాల్ పై సుచిత్ర సంచలన కామెంట్స్..
ఆ వీడియోలో సుచిత్ర మాట్లాడుతూ, అభిమానులు చాలా చీప్‌గా ఉన్నారు, మీరందరూ విశాల్‌పై జాలిపడుతున్నారు. చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయం నేను మీకు చెప్తాను. ఒక రోజు నా భర్త కార్తీక్ ఇంట్లో లేని సమయంలో, తలుపు తట్టిన శబ్దం వినిపించింది. నేను వెళ్లి డోర్ తెరవగానే , విశాల్ చేతిలో వైన్ బాటిల్‌తో నిలబడి ఉన్నాడు, కార్తీక్ కుమార్ ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు.. లేడని వాదించి బయటకు నెట్టేసి డోర్ వేసాను. అప్పుడు అతని ప్రవర్తన చూసి షాక్ అయ్యాను. విశాల్ ఆరోగ్యంపై అభిమానులు, తోటి నటులు ఆందోళన వ్యక్తం చేయగా, సుచిత్ర చేసిన వ్యాఖ్యలు నిరాధారంగా ఉన్నాయని విమర్శించారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలకు ముఖ్యాంశాలు కావడం ఇదే మొదటిసారి కాదు. ఆమె గతంలో తన మాజీ భర్త కార్తీక్ కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని షాకింగ్ ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది.
నిజానికి విశాల్ ఆరోగ్యం గురించి అందరికి తెలిసిందే.. చెన్నైలోని అపోలో ఆస్పత్రి విశాల్‌కు వైరల్ ఫీవర్ సోకిందని, పూర్తి విశ్రాంతి తీసుకోవాలని నిర్ధారిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.. సుచిత్ర ఇలా మాట్లాడటం తప్పు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.