Nindu Noorella Saavasam Serial Today Episode : అమర్ రూంలోకి వెళ్లిన రామ్మూర్తి, ఆరు ఫోటో చూస్తూ ఏడుస్తుంటాడు. అమర్ ఓదారుస్తాడు. ఆరు ఆస్థికలు తాకి బోరున ఏడుస్తుంటాడు. రాథోడ్, అమర్ కూడా ఏడుస్తారు. మీరు మిస్సమ్మకు ఎందుకు చెప్పలేదు అని అమర్ అడగ్గానే వద్దు బాబు చెప్పొద్దు ఈ నిజం తెలిస్తే తను గుండె పగిలి చనిపోతుంది. బాబు ఈ నిజాన్ని మీరు ఎందుకు నాతో దాచారో ఇప్పుడు అర్థం అయింది. మీరు కూడా చెప్పొద్దు బాబు అంటూ ఏడుస్తూ వెళ్లిపోతాడు రామ్మూర్తి. ఇంతలో డిన్నర్ రెడీ చేశాను రండి అంటూ పిలుస్తూ మిస్సమ్మ వస్తుంది. నాన్నా ఎక్కడ అని అడుగుతుంది.
వెళ్లిపోయారు మిస్సమ్మ అని అమర్ చెప్పగానే.. ఎందుకు వెళ్లిపోయారు.. నాకు చెప్పకుండా వెళ్లిపోరే అంటుంది మిస్సమ్మ.. ఏదో అర్జెంట్ గుర్తుకు వచ్చిందట అందుకే నాతో చెప్పి వెళ్లారు అని అమర్ చెప్పగానే.. అయితే మీరు రండి తిందురు.. నాన్నతో ఫోన్‌లో మాట్లాడతాను అంటుంది. అమర్ నాకు ఆకలిగా లేదని మీరు తినండి అంటూ వెళ్లిపోతాడు. రాథోడ్ కూడా ఇక నేను వెళ్తాను రేపు పొద్దున్నే రావాలి కదా అంటాడు. నిజం చెప్పు రాథోడ్ అక్క గురించి మీకు తెలుసు కదా..? అక్కని కలిశారా..? వద్దని వదిలేసిన తండ్రి, ఈ చెల్లిని వద్దని చెప్పింది. అలాంటిదేదో జరిగింది అందుకే కదా మీరు అదరూ ఇలా ఉన్నారు అని మిస్సమ్మ అడగ్గానే.. అలాంటిదేం లేదని నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావని చెప్పి వెళ్లిపోతాడు రాథోడ్.
ఘోర పొద్దునే మనోహరికి ఫోన్ చేసి ఇవాళ పౌర్ణమి అని మర్చిపోయావా..? మనోహరి అని చెప్తాడు. గుర్తుంది ఘోర ఆత్మ ఎవరిలో ప్రవేశించిందో కనుక్కుని చెప్పాలి కదా..? అంటుంది మనోహరి అవునని ఘోర చెప్పగానే.. సరే చెప్తానులే అంటూ ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు గార్డెన్‌లో గుప్త, ఆరు కోసం వెతుకుతుంటాడు. ఎక్కడా కనిపించదు. బాలిక ఎక్కడ కనిపించడం లేదు. ఎవరి శరీరంలోనైనా ప్రవేశించినదా.? అటులైనచో పౌర్ణమి గడియలు ముగిసే లోపు కట్టడి చేయడం కష్టం అని ఆలోచిస్తుంటే.. రాథోడ్ లోపలి నుంచి సీరియస్‌గా వస్తాడు.
గుప్త అనుమానంగా ఆరు, రాథోడ్ లోపల ప్రవేశించిందేమో అనుకుంటాడు. రాథోడ్ కారు దగ్గరకు వచ్చి పాటలు పాడుతుంటే.. గుప్త కాదని వెళ్లిపోతాడు. మరోవైపు లోపల మనోహరి తన రూంలోంచి బయటకు వచ్చి హాల్లో పేపరు చదువుతున్న శివరాం ను చూసి అది ఇంత తీరిగ్గా కూర్చుని పేపరు చదవదు అనుకుని రూం డోర్ దగ్గరకు వెళ్లి నిర్మలను చూస్తుంది. మనోహరిని చూసిన నిర్మల ఉలిక్కిపడుతుంది. అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు మిస్సమ్మ ఎక్కడ ఉందో అడుగుదామని అంటుంది మనోహరి. మిస్సమ్మ కిచెన్ లోనే ఉంది కదా అంటుంది నిర్మల అవునా అయితే సరే అంటూ మనోహరి వెళ్లిపోతుంది.
కిచెన్ డోర్ దగ్గరకు వెళ్లి చూస్తుంటే.. ఏం చూస్తున్నావు అని మిస్సమ్మ అడుగుతుంది. దగ్గరకు వెళ్లి నన్ను ఎలా చూశావు అని అడుగుతుంది మనోహరి. విండో మిర్రర్‌లో కనిపించావు అంటుంది మిస్సమ్మ. మనోహరి అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక వేళ పిల్లల్లోకి వెళ్లిందేమోనని పైకి వెల్లి పిల్లల రూంలో చూస్తుంది అక్కడ కూడా ఎవరిలో లేకపోవడంతో కిందకు వస్తుంది మనోహరి. ఇంతలో బయటి నుంచి వచ్చిన అమర్ దొరికిందా మనోహరి.. ఇంట్లో అందరినీ ఎందుకు డౌటుగా చూశావు.
నువ్వు అందరితో మాట్లాడటం నేను చూశాను. అనగానే మనోహరి షాక్ అవుతుంది. ఇంతలో షాక్ నుంచి కోలుకుని.. ఆరు కోసం వెతికాను. రేపే ఆస్థికలు నదిలో కలుపుతున్నాం.. అంటే ఆరు ఇక రేపటి నుంచి ఆరు ఇక్కడ ఉండదు కదా..? అందుకే తన ఉనికి నాకు తెలుస్తుందేమోనన్న ఆశతో చూశాను అని చెప్తుంది. ఆరు గురించి చెప్పగానే.. అమర్ కూల్ అవుతాడు. ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతాడు.
ఆరును వెతుక్కుంటూ.. వెళ్లిన గుప్తకు అనాథ ఆశ్రమం దగ్గర ఆరు కనబడుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గుప్త అడగ్గానే.. మనశాంతి కోసం వచ్చానని. నేను ఎవరి శరీరంలోకో ప్రవేశిస్తాననే కదా..? మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఇక నేను ఎవరి శరీరంలోకి ప్రవేశించను. కానీ చివరి సారిగా ఒక్క సాయం అడుగుతాను చేస్తారా..? కొద్ది రోజులు మా నాన్న, చెల్లితో ఉంటాను అని అడుగుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?