E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయి అందానికి బానిసయ్యే సన్యాసి… పెళ్ళి చేసుకొని ఏం చేశాడో తెలిస్తే గూస్ బంప్స్…

OTT Movie : అమ్మాయి అందానికి బానిసయ్యే సన్యాసి… పెళ్ళి చేసుకొని ఏం చేశాడో తెలిస్తే గూస్ బంప్స్…
Advertisement

OTT Movie : లవ్ స్టోరీ లతో సినిమాలను ఎక్కువగా తీసి, వీటిని ఒక కొత్త తరహాలో చూపిస్తుంటారు మేకర్స్. మనం చెప్పుకోబోయే మూవీలో ఒక సన్యాసి, అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత జీవితంలో అతడు ఎదుర్కొనే సన్నివేశాలతో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం  ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి,? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో అమెజాన్ (Amazon prime video) లో

Advertisement

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఫీల్ గుడ్ మూవీ పేరు “స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, వింటర్ అండ్ స్ప్రింగ్‘ (spring, summer, fall, winter and spring).ఈ మూవీలో సన్యాసి పెళ్లిచేసుకొని, బొక్క బోర్లా పడతాడు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

ఒక మారుమూల ప్రాంతంలో బుద్ధ భగవానుడి టెంపుల్ ఉంటుంది. అందులో ఇద్దరు గురు శిష్యులు పూజలు చేసుకుంటూ ఉంటారు. శిష్యుడికి ఎవరూ లేకపోవడంతో, చిన్నప్పటినుంచి గురువు దగ్గర పెరుగుతాడు. అయితే అక్కడికి కూతురికి బాగాలేదని ఒక మహిళ వస్తుంది. ఆమెకు అక్కడున్న ఆకు మందులతో వైద్యం చేస్తుంటాడు గురువు. శిష్యుడు, అక్కడికి వచ్చిన మహిళ కూతురితో ప్రేమలో పడతాడు. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ, ఆ ప్రాంతంలోనే ఏకాంతంగా గడుపుతుంటారు. అయితే ఒక రోజు ఈ విషయం గురువుకి తెలుస్తుంది. అయినా అతన్ని ఏమీ అనకుండా సైలెంట్ గా ఉంటాడు. అదే రోజు ప్రియురాలు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. శిష్యుడు ఆమె వెళ్లి పోతుండటంతో బాధపడతాడు. శిష్యుడు కూడా ఆమెను వెతుక్కుంటూ వెళ్లిపోతాడు. అప్పుడు కూడా గురువు సైలెంట్ గానే ఉంటాడు. కొంతకాలం తర్వాత భిక్షాటన చేసుకొని తిరిగి వచ్చిన గురువుకి పేపర్లో ఒక ప్రకటన కనబడుతుంది. అందులో శిష్యుడు భార్యను చంపి పారిపోయినట్టుగా రాసి ఉంటారు. శిష్యుడు దగ్గర్లోనే ఇక్కడికి వస్తాడని గురువుకి  అర్థమవుతుంది.

ఆ మరుసటి రోజు శిష్యుడు, గురువు దగ్గరికి వస్తాడు. ఆమె నన్ను మోసం చేసిందని అందుకే తనని చంపేశానని చెప్తాడు. గురువు అప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. శిష్యున్ని పోలీసులు వచ్చి తీసుకువెళ్తారు. గురువుకి వయసు అయిపోతూ ఉండటంతో కొంతకాలానికి చనిపోతాడు. ఆ తరువాత కొంత కాలానికి శిష్యుడు అక్కడికి వస్తాడు. గురువు చనిపోయిన ప్లేస్ లో గురువు దంతాలను వెతికి భద్రపరుస్తాడు. ఆ తర్వాత అక్కడికి ఒక మహిళ, తన కొడుకుని తీసుకువస్తుంది. శిష్యుడు నీటి కోసం తవ్విన ఒక గుంతలో ఆ మహిళ పడి చనిపోతుంది. అక్కడ ఆమె కొడుకు ఏడుస్తూ ఉండటంతో, శిష్యుడు ఆ బాలుడిని ఎత్తుకుంటాడు. తన వల్లే ఇలా జరిగిందని బాధపడతాడు. అయితే ఆ ప్రదేశంలో ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. శిష్యుడి తర్వాత మరొక కొత్త శిష్యుడు తయారవుతాడు. మంచి మెసేజ్ ని ఇచ్చే ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×