BigTV English

Arti – Jayam Ravi: రవి మోహన్ చెప్పింది నిజమేనా.. ఆ హీరోతో ఆర్తి ఎఫైర్.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న నిజాలు!

Arti – Jayam Ravi: రవి మోహన్ చెప్పింది నిజమేనా.. ఆ హీరోతో ఆర్తి ఎఫైర్.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న నిజాలు!

Arti – Jayam Ravi:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న రవి మోహన్ (Ravi Mohan) అలియాస్ జయం రవి (Jayam Ravi) గత కొన్ని నెలలుగా వ్యక్తిగత కారణాలవల్ల వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రముఖ నటి ఆర్తి (Arti)ని ప్రేమించి మరీ వివాహం చేసుకున్న ఈయన.. ఇప్పుడు ఈమెతో విభేదిస్తున్నారు. వైవాహిక జీవితంలో పదేళ్లపాటు గడిపిన ఈ జంట అనూహ్యంగా ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత ఇప్పుడు విడాకులు కోరుకుంటూ ఉండడం పై పలువురు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు జయం రవి అత్త, ఆర్తి తల్లి కూడా జయం రవి కోసం జీవితంతో పాటు ఆస్తులు కూడా ధారపోసాను. కానీ ఇప్పుడు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు అంటూ కామెంట్లు చేసింది. అయితే జయం రవి మాత్రం తనకు ఆర్తి నుంచి విడాకులు కావాల్సిందే అని పట్టుబట్టారు. మరొకవైపు జయం రవి ప్రముఖ సింగర్ కెనీషా (Kenisha )తో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుండడం ఆర్తి మాటలకు మరింత ఆజ్యం పోసింది. ప్రస్తుతం ఆర్తికి విడాకులు ఇచ్చి కెనీషాతో ఏడడుగులు వేయాలని జయం రవి చూస్తున్నాడు అంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది.


అతడితో ఆర్తి ఎఫైర్.. సంచలనం రేపిన సుచిత్ర..

ఇదిలా ఉండగా ఆర్తి – జయం రవి విడిపోతున్నారు అంటూ వార్తలు వస్తున్న వేళ సడన్గా ఆర్తి ఆ స్టార్ హీరోతో ఎఫైర్ నడుపుతోంది అంటూ ఒక ఫోటో కూడా షేర్ చేసింది సింగర్ సుచిత్ర (Suchitra). ఈ ఫోటోలో ఉంది ఎవరో కాదు స్టార్ హీరో ధనుష్(Dhanush). ధనుష్ – ఆర్తి ఒకరికొకరు అత్యంత దగ్గరగా ఉన్న ఫోటో ఆమె షేర్ చేసింది. ఈ ఫోటో సడన్ గా చూస్తే ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతాయి. ముఖ్యంగా ఆర్తి.. ధనుష్ తో ప్రేమలో ఉంది కాబట్టే జయం రవి ఆమె నుండి విడాకులు కోరుతున్నాడు అంటూ హాట్ బాంబు పేల్చింది. దీంతో కొంతమంది నెటిజన్స్ జయం రవికి మద్దతు పలుకుతున్నారు.


నిజం ఏంటంటే..?

అయితే సింగర్ సుచిత్ర షేర్ చేసిన ఫోటోను నిజంగా ఆరా తీస్తే.. ఫోటో నిజమే కానీ వారిద్దరి మధ్య బంధం ఎఫైర్ కాదు. గతంలో జయం రవి ఈ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ ద్వారా స్వయంగా షేర్ చేసి వీరి బంధాన్ని అన్నాచెల్లెళ్లుగా ప్రకటించారు. అయితే ఆ ఫోటోను పట్టుకొని ఇప్పుడు సుచిత్ర వక్రీకరించడంతో సుచిత్ర తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇకనైనా మారవా అంటూ ఆమెపై పలు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఆర్తి క్యారెక్టర్ ను ఒక్కసారిగా బ్యాడ్ చేసింది సుచిత్ర. దీంతో ఆర్తి అభిమానులు కూడా సింగర్ సుచిత్రపై మండిపడుతున్నారు.

విడాకులు కావాలంటే.. భరణం చెల్లించాల్సిందే ..?

తాజాగా జయం రవి భార్య ఆర్తి కోట్లో పిటిషన్ వేసింది జయం రవి తన నుండి విడాకులు కోరినట్లయితే ప్రతినెల తనకు 40 లక్షల భరణం ఇవ్వాలని పిటీషన్ పెట్టింది ఆర్తి మరి ఆర్తి డిమాండ్ మేరకు జయం రవి భరణం ఇవ్వడానికి ఒప్పుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ALSO READ:Jr. NTR: మంచు విష్ణు రికార్డునే బ్రేక్ చేయలేకపోయిన తారక్.. హవ్వా… పరువు మొత్తం పాయే.!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×