Pawan Kalyan : ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. నేడు రిలీజ్ అయిన “అసూర హనుమాన్” సాంగ్ కు రెస్పాన్స్ కూడా బానే వస్తుంది. దీన్ని చూస్తే హరి హర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అనిపిస్తుంది. అయితే ఇలాంటి సినిమాను ముందుగా క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే… ఏవేవో కారణాలు అంటూ ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నాడు. క్రిష్ స్థానంలో ఈ సినిమా నిర్మాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే క్రిష్‌ను మూవీ నుంచి తప్పించారా..? లేక ఆయనే తప్పుకున్నాడా..? అంటూ అప్పట్లో దీనిపై చాలా చర్చ జరిగింది.
ఎంత చర్చ జరిగినా… దీనిపై మూవీ యూనిట్ పెద్దగా స్పందించలేదు. ఫ్యాన్స్ కూడా మూవీ కంప్లీట్ అయితే చాలు… డైరెక్టర్ గురించి ఏంటి అనే ఫీల్ లోనే ఉండిపోయారు. అయితే… ఇప్పుడు ఆ విషయం బయటికి వచ్చింది అంటూ ఓ వార్త ఇండస్ట్రీలో తిరుగుతుంది. అది ఏంటంటే….
పవన్ ఖాళీ ఉన్నప్పుడు…
పవన్ కళ్యాణ్ హీరోగా… హరి హర వీరమల్లు సినిమా స్టార్ట్ అయింది. అప్పుడు… పవన్ కళ్యాణ్ కి పొలిటికల్ పనులు పెద్దగా లేవు. అప్పటికే వకీల్ సాబ్ రిలీజ్ చేశాడు పవన్. అలాగే బీమ్లా నాయక్ ను కూడా పట్టాలెక్కించి డేట్స్ ఇచ్చాడు. అప్పుడే హరి హర వీరమల్లు సినిమాను కూడా ఫినిష్ చేయాలని పవన్ అనుకున్నాడట.
క్రిష్ చేసిన తప్పు ఇది ఒక్కటే…?
బీమ్లా నాయక్ తో పాటు హరి హర వీరమల్లును కూడా ఫినిష్ చేయాలని అనుకున్న పవన్‌కు క్రిష్ అప్పుడు షాక్ ఇచ్చాడట. హరి హర వీరమల్లు షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత… పవన్ కొన్ని డేట్స్ బీమ్లా నాయక్ కు ఇచ్చాడు. ఆ గ్యాప్ లో తాను ఓ సినిమా చేస్తానని పవన్ కు క్రిష్ చెప్పాడట. బీమ్లా నాయక్ ఫినిష్ చేసే లోపే తాను కూడా ఆ మూవీ ఫినిష్ చేసి.. మళ్లీ హరి హర వీరమల్లు స్టార్ట్ చేయొచ్చు అని పవన్‌తో క్రిష్ చెప్పాడట.
కొండపొలం వల్లే పవన్ కోపం వచ్చిందా..?
అలా… హరి హర వీరమల్లును పక్కన పెట్టి… క్రిష్ కొండ పొలం చేశాడట. పవన్ మేనల్లుడితోనే సినిమా చేసినా… క్రిష్ వల్లనే హరి హర వీరమల్లు ఆలస్యమైందని పవన్ అనుకున్నాడట. తనను పక్కన పెట్టి వేరే సినిమా చేయడం ఏంటి..? అందులోనూ తన మేనల్లుడికి ఓ డిజాస్టర్ మూవీ ఇచ్చాడు అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా ఓ టాక్ ఉంది.
అలా… వీరమల్లు మూవీ నుంచి క్రిష్ తప్పుకోవాల్సి వచ్చిందట. క్రిష్ తప్పుకున్న తర్వాత జరిగిన పరిణామాలు ఇక అందరికీ తెలిసిందే. ఎఏం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ రంగంలోకి దిగడం… అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పర్యవేక్షణ చేయడం… సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడం… జూన్ 12న రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేయడం అన్నీ అలా జరిగిపోయాయి.
ఏది ఏమైనా… హరి హర వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అనే ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అయితే దీనిలో నిజం ఎంత ఉందో.. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడికి.. హరి హర వీరమల్లు మూవీ టీంకే తెలియాలి.