Rain Update: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలో పలు చోట్ల వర్షం పడుతోంది. గచ్చిబౌలి, బండ్లగూడ, హైటెక సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, నాంపల్లి, చార్మినార్, కోఠి, అబిడ్స్, నారాయణగూడ, అశోక్ నగర్, ముషీరాబాద్, రామాంతపూర్, అంబర్ పేట్ ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది.
అయితే హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కీలక సూచనలు చేసింది. శంషాబాద్, ఆరంఘర్, చాంద్రాయణ గుట్ట, పహాడీ షరీఫ్, అత్తాపూర్, టోలీచౌకీ, రాజేంద్ర నగర్, మెహిదీపట్నం, షేక్ పేట్, లంగర్ హౌజ్, నార్సింగి, బండ్లగూడ జాగీర్, గచ్చిబౌలి, నానక్ రాంగూడ, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, బీహెచ్ఈఎల్, మదీనాగూడ, మియాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో మరి కొన్ని గంటల తర్వాత మేఘాలు కమ్మేస్తాయని, ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే సిద్దిపేట, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, జగిత్యా, నిజామాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మరికొన్ని గంటల్లో భారీ వర్షం పడనుంది.
హైదరాబాద్ లో రానున్న మూడు రోజులు పాటు వర్షాలు దంచికొడతాయని.. ఈ క్రమంలోనే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ మూడు రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాగల 12 గంటలలో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇది రాగల 36 గంటల్లో ఉత్తర దిక్కులో కదులుతూ క్రమేపి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించారు.
Also Read: BEL Recruitment: బెల్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.55,000 జీతం, ఈ అర్హత ఉంటే ఎనఫ్
ఈ ప్రభావంతోనే తెలంగాణలో ఇవాళ, రేపు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని అన్నారు. ఈరోజు పశ్చిమ, తూర్పు జిలాలకు భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. హైదరాబాద్ వాతావరణ శాఖ 15 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
Also Read: AVNL Recruitment: ఏవీఎన్‌ఎల్‌లో 1805 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు, ఈ అర్హత ఉంటే చాలు