E-Paper
Advertisement

Siva Karthikeyan: సింహాన్ని దత్తత తీసుకున్న హీరో..

Siva Karthikeyan: సింహాన్ని దత్తత తీసుకున్న హీరో..
Advertisement

Siva Karthikeyan: కొందరు నటీనటులు ఫేమ్, డబ్బు సంపాదించిన తర్వాత కూడా ఇతరులకు సాయం చేయాలని ఆలోచిస్తుంటారు. అందులో భాగంగానే ఊళ్లను దత్తత తీసుకుంటారు, అనాథ పిల్లలను చదివిస్తారు, వృద్ధులకు సాయం చేస్తారు.. ఇలా ఎన్నో ఛారిటీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేవలం సాటి మనుషుల గురించి మాత్రమే కాకుండా ఇతర ప్రాణుల గురించి ఆలోచించేవారు కూడా ఉంటారు. అలా ఆలోచించే సింహాన్ని దత్తత తీసుకున్నాడు ఓ నటుడు.

తమిళ హీరో శివకార్తికేయన్ ముందుగా యాంకర్‌గా తన ఇండస్ట్రీ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మెల్లగా సహాయ నటుడిగా మారాడు. ఆ తర్వాత తనకు హీరో ఛాన్సులు రావడం మొదలయ్యింది. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే సినిమాలలో నటిస్తూ.. మినిమమ్ హిట్ హీరోగా మారాడు. ప్రస్తుతం తన తమిళ సినిమాలు అన్ని తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి. తెలుగులో కూడా శివకార్తికేయన్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Advertisement

హీరోగా మారిన తర్వాత తను సంపాదించిన దానిలో కొంత ఛారిటీకి అందించడం మొదలుపెట్టాడు శివకార్తికేయన్. ఇప్పటికే తాను ఎన్నో ఛారిటీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు కూడా. అంతే కాకుండా తనకు జంతువులు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే పలు జంతువులను దత్తత తీసుకున్న హిస్టరీ ఉంది ఈ హీరోకు. తాజాగా ఈ హీరో మరో సింహాన్ని కూడా దత్తత తీసుకున్నాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

శివకార్తికేయన్ తాజాగా దత్తత తీసుకున్న సింహం పేరు షేరు. ప్రస్తుతం దీనికి మూడేళ్ల వయసు. వందలూర్‌లోని అరిగ్నర్ అన్నా జూలాజికల్ పార్క్‌లో ఉండే ఈ సింహాన్ని శివకార్తికేయన్ దత్తత తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆరు నెలల వరకు షేరు బాధ్యత శివకార్తికేయన్‌దే అని సమాచారం. ఈ హీరో ఇంతకు ముందు 2021లో విష్ణు అనే సింహాన్ని, ప్రకృతి అనే ఏనుగును ఇదే జూ నుండి దత్తత తీసుకున్నాడు. వారి బాధ్యతలు కూడా ఆరు నెలల పాటు చూసుకున్నాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×