Skanda Movie In OTT : స్కంద' ఓటీటీ రిలీజ్ పోస్ట్ పోన్.. ఆన్ లైన్ స్ట్రీమింగ్ అప్పుడే..

Skanda Movie In OTT : ‘స్కంద’ ఓటీటీ రిలీజ్ పోస్ట్ పోన్.. ఆన్ లైన్ స్ట్రీమింగ్ అప్పుడే..

skanda movie in hotstar
Share this post with your friends

skanda movie in hotstar

Skanda Movie In OTT : రామ్ పోతినేని, శ్రీ లీల కాంబో లో బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన చిత్రం స్కంద. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పర్ఫామెన్స్ పరంగా పరవాలేదు అనిపించుకుంది. ఫ్యాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించిన ఈ చిత్రం లో బోయపాటి మార్క్ యాక్షన్ కు రామ్ పోతినేని ఎనర్జీ బాగా సింక్ అయింది. ఊర మాస్ డైలాగ్స్ తో.. కిర్రాక్ ఫైట్స్ తో కేక పెట్టించారు.నేను సంపేటపుడు వాడి తలకాయ యాడుందో చూస్తాను..ఆడి యెనకాల ఎవరున్నారో సూడను..లాంటి పవర్ఫుల్ మాస్ డైలాగ్స్ ఈ మూవీ హైప్ పెంచాయి.

రామ్ పోతినేని కెరియర్ లో భారీ ఓపెనింగ్ నమోదు చేసిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 32.60 కోట్ల షేర్‌ను వసూలు చేయడంతో పాటు 57 కోట్ల గ్రాస్ తన ఖాతాలో వేసుకుంది. 47 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ సుమారు 80 శాతం వరకు రికవరీ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత స్కంద ఓటీటీ లోకి వస్తుంది అనుకున్నవారికి.. 50 రోజుల విండో పీరియడ్ కంటే కూడా ముందుగా అక్టోబర్ 27న ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది అని టాక్ వచ్చింది.

ఓటిటీ దిగ్గజ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ ఈ చిత్రం యొక్క స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లుగా అక్టోబర్ 25 తారీఖున ఈ చిత్రం స్ట్రీమింగ్ కాలేదు. ఎందుకంటే ఈ మూవీ వచ్చే దీపావళికి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి గాను అన్ని భాషలతో కలిపి స్ట్రీమింగ్ రైట్స్ను 35 కోట్లకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.

ఈ మూవీ తర్వాత రామ్ ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ మూవీ సీక్వెల్ డబల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు. గతంలో రామ్ ,పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. మరి తిరిగి వీరిద్దరి కాంబో వసూళ్ల వర్షం రాబడుతుంది అని అందరూ ఆశిస్తున్నారు. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నట్లు సమాచారం. లైగర్ మూవీ తో బాగా డీలా పడిన పూరి జగన్నాథ్, స్కంద నిరాశతో ఉన్న రామ్ పోతినేనీ ఇద్దరు డబుల్ ఇస్మార్ట్‌ పై డబుల్ అశలు పెట్టుకున్నారు. మరి శివరాత్రి సందర్భంగా మార్చి 8న 2024లో విడుదల కాబోతున్న ఈ మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

amit shah : అధికారంలోకి వస్తే.. బీసీ నేతే సీఎం.. అమిత్ షా కీలక ప్రకటన..

Bigtv Digital

Aigiri Nandini Song : అయిగిరి నందిని సాంగ్

BigTv Desk

SSMB 29: మ‌హేష్‌బాబుకి ఎమోష‌న్స్ ఉండ‌వా?

BigTv Desk

WTC Final : ఫైనల్ సమరానికి భారత్ జట్టు ఎంపిక.. టీమ్ లో ఎవరున్నారో తెలుసా..?

Bigtv Digital

Dasara 2023 : అపరాజితా.. నమోస్తుతే..!

Bigtv Digital

Titan Submarine : టైటాన్ కథ విషాదాంతం.. ఐదుగురు సందర్శకులు జలసమాధి..

Bigtv Digital

Leave a Comment