BigTV English

The Raja Saab : అఫీషియల్ అప్డేట్ వచ్చేసినట్లే, ఏకంగా మారుతి ఫ్రెండ్ క్లారిటీ ఇచ్చాడు

The Raja Saab : అఫీషియల్ అప్డేట్ వచ్చేసినట్లే, ఏకంగా మారుతి ఫ్రెండ్ క్లారిటీ ఇచ్చాడు

The Raja Saab : ప్రతి హీరో కెరియర్ లో కూడా వాళ్ల జీవితాలను మలుపు తిప్పే సినిమాలు కొన్ని ఉంటాయి. అలా ప్రభాస్ విషయానికొస్తే బాహుబలి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎస్ఎస్ రాజమౌళి ఆలోచన విధానాన్ని నమ్మి ఆ సినిమా కోసం దాదాపు 5 సంవత్సరాలు సమయాన్ని కేటాయించాడు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. కేవలం ప్రభాస్ కెరియర్ కు మాత్రమే ప్లస్ అవడం కాకుండా తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచింది. తెలుగు సినిమాకి ఒక సరికొత్త గౌరవాన్ని తీసుకొచ్చిన సినిమా బాహుబలి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలైంది. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలు వచ్చిన అవి ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.


సలార్ సినిమాతో కంబ్యాక్

కే జి ఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు దర్శకుడు ప్రశాంత్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల సునామీ పుట్టించింది. ఇదివరకే ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఉగ్రం సినిమాకి కొన్ని మార్పులు చేసి సలార్ సినిమాగా మలిచాడు. ప్రభాస్ కటౌట్ ను 100% వాడుకొని అభిమానులకు విజువల్ ట్రీట్ అందించాడు. ఈ సినిమాతో ప్రభాస్ గ్రేట్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ బేస్ సినిమా చేయలేదు. అలానే మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.


టీజర్ అప్డేట్

ప్రభాస్ తో సినిమాను అనౌన్స్ చేయడానికి అంటే ముందు, ఒకవేళ ప్రభాస్ తో సినిమా చేస్తే డార్లింగ్, బుజ్జిగాడు లాంటి ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తాను అని ఇదివరకే మారుతి తెలిపాడు. ఇప్పుడు మారుతి చేస్తున్న సినిమా హర్రర్ కామెడి అని తెలుస్తుంది. ఈ సినిమా ఆల్మోస్ట్ తుది దశలో ఉంది. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ ని త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. దీనిపై నిర్మాత మారుతిక మంచి ఫ్రెండ్ అయినా ఎస్కేఎన్ స్పందించారు ఇంకో రెండు వారాల్లో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాబోతున్నట్లు చెప్పుకొచ్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఆ బ్యానర్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం ఇది.

Also Read : Anil – Megastar Chiranjeevi: షూటింగ్ డేట్ ఫిక్స్, సెకండ్ షెడ్యూల్ నుండే ప్రమోషన్స్

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×